హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయాన్ని రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి తన సతీమణి, బంధువులతో కలిసి సందర్శించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఉత్తిష్ట గణపతి దర్శనం అనంతరం రుద్రేశ్వరస్వామికి వద్ద గోత్రనామాలతో లఘు రుద్రాభిషేకం నిర్వర్తింపజేసి ఆలయ నాట్యమండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. వేదఆశీర్వచనం నిర్వర్తించి ఆలయప్రాశిస్తాన్ని ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ వారికి వివరించారు. సూర్య, విష్ణు ఆలయాల చరిత్ర నాట్యమండపం, స్తంభాలపై వెంట్రుక పట్టే అటువంటి రంధ్రాలు, జిట్టెడు ఆంజనేయస్వామి, తలకిందులచాప తలకిందుల మనిషి, అష్టదిక్పాలకులు గాయత్రిమాత, కళ్యాణమండపం విశేషాలను వారికి వివరించారు. వారు అద్భుతమైన శిల్పకళా అని తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణమన్నారు. కాకతీయులు భారత సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించేవిధంగా అద్భుత శిల్పకలని అందించారని ఆయన పేర్కొన్నారు. వారసత్వ సంపదలను సమాజం కాపాడుకోవాలన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్‌శర్మ, సందీప్‌శర్మ, మణికంఠశర్మ ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలను నిర్వర్తించారు. వారికి ఆలయ సిబ్బంది మధుకర్, రజిత,రామకృష్ణ సేవలందించారు. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


