ఇటు నియంత పాలన..అటు లొంగుబాటు వాదన..!!

“తెలంగాణలో ముఖ్యంగా కమ్యూనిస్ట్‌ ఉద్యమాలు బలంగా ఉన్న ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చివేస్తుండగానే మరోవైపు తెలంగాణలో ఒక చరిత్రాత్మక ఘట్టం జరిగింది. ఏ భూస్వామ్య అణచివేతలు, ఫ్యూడల్ విధానాలకు, కుల అణచివేతలకు, అసమానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో ఉవ్వేత్తు ఎగిసిన మావోయిస్టు‌ పార్టీకి చెందిన టాప్‌ లీడర్స్‌ ప్రభుత్వం దగ్గర సరెండర్‌ అయ్యారు.అయితే ఒకవైపు గ్రామాల్లో కుల రక్కసి బుసలు కొడుతోంది..మరోవైపు ప్రభుత్వమే పేదల ఇళ్లను కూల్చుతుంది. ఇంకోవైపు ప్రభుత్వం, దాని అనుమాయిలు చేస్తున్న దాష్టీకాలపై కమ్యూనిస్ట్ పార్టీలు మౌనంగా ఉంటాయి.ఇవన్నీ జరగడం యాదృచ్ఛికం..”

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలతో పాటు ప్రజాస్వామ్యం, పత్రిక స్వేచ్ఛ, పౌరహక్కులు, రాజ్యాంగం అమలు అంటూ ఏడో గ్యారంటీ పేరుతో 2023లో డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలను ప్రజలను నమ్మినట్లే, కాంగ్రెస్ ఇచ్చిన ఏడో గ్యారంటేనీ ప్రజాస్వామ్యవాదులు, బుద్ది జీవులు, మేధావులు,పౌరసంఘాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్‌లు, ఆలోచనాపరులు నమ్మారు. బీఆర్ఎస్‌ను ఓడించడంలో కీలకపాత్ర పరోక్షంగా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేశారు.

కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఆరు గ్యారంటీలను గాలికి వదిలేసింది.ఏడో గ్యారంటీని తుంగలో తొక్కింది.అటు ప్రజలను ఇటు ప్రజాస్వామ్యవాదులను తడిగుడ్డతో గొంతు కొసింది. నక్కజిత్తుల మాటాలతో, ఊరవెల్లి రాజకీయాలతో తెలంగాణలో అన్ని వర్గాలకు ద్రోహం చేసింది..వెరిసి ఇచ్చిన ఆరు, ఏడో గ్యారంటీలను పక్కనబెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇవ్వని 8వ ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్దమైన గ్యారంటీ అమలు చేస్తుంది. ప్రజలను అణచివేస్తుంది. ప్రజాస్వామ్యవాదులపై దాడులు చేస్తుంది. జర్నలిస్ట్‌లను అక్రమంగా అరెస్ట్ చేస్తుంది.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంది.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది.అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అణచివేతలు, ఆంక్షలు అమలు చేసింది.ఏకంగా ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్ దగ్గర కంచెకట్టింది. నగరంలో 144 సెక్షన్, పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేసింది.విద్యార్థుల పోరాటాలు, నిరుద్యోగుల ఆందోళనను కఠినంగా అణచివేసింది.

ఉద్యోగులు, ఆర్టీసీ, ఆటో,ఆశ వర్కర్ల నిరసనలను నియంతృత్వంతో రక్తసిక్తం చేశారు. పోలీసుల సంకేళ్లు, లాఠీలతో నెత్తురు పారించారు.అంతేకాదు ఒకవైపు నక్సల్స్‌తో చర్చలు జరపాలంటూనే మరోవైపు ఏడాదిలోనే పదుల సంఖ్యలో ఎన్‌ కౌంటర్‌లు చేసింది. ఆట పాట మాట రాతలపై నిర్బంధాలు ప్రయోగించింది.హాల్‌ మీటింగ్‌పై ఆంక్షలు పెట్టింది. కాంగ్రెస్‌ ప్రజాస్వామ్య ముసుగేసుకుని నక్కజిత్తులా పాలన చేస్తుంటే దాన్ని అంచనవేయని మేధావి వర్గం, పౌర సంఘాలు కాంగ్రెస్‌ పంచన చేరి మౌనాన్ని పాటిస్తున్నారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉన్న కాస్తో కూస్తో వెసులుబాటు కూడా కాంగ్రెస్‌లో పాలన కనిపించడం లేదు.గతం కంటే ఎక్కువ జర్నలిస్ట్‌లు, పౌర సమాజంపై వేధింపులు పెరిగాయి.

ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడుతానంటూనే అప్రజాస్వామ్య పాలన చేస్తుంది. రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటూనే ప్రజల హక్కులను హరిస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిరాగానే భూ దందాలకు తెగబడింది. భూ మాఫియాను పెంచిపోషిస్తుంది.నయీంను మించిన నయా నయీంలా ప్రభుత్వ పెద్దలు తయారయ్యారు. గద్దల్లా పేదల భూములను చెరబడుతూ కబ్జాలకు తెగబడున్నారు. అభివృద్ది పేరుతో విధ్వంసానికి పాల్పడుతూ భూ దోపిడీ, నిధుల దోపిడీకి తెగబడుతున్నారు.ఫార్మా కంపెనీలు, ఫోర్త్‌ సిటీ, గాంధీ సరోవరం, మూసీ సుందరీ కరణ అంటూ పేదల భూములు పెద్దోళ్లకు దోచిపెట్టే కుట్రలు కాంగ్రెస్‌ చేస్తుంది.విగ్రహాల రాజ భోగాలకు పేదల గూళ్లు కూల్చుతున్నారు. ప్రభుత్వం కుట్రలను భగ్నం చేస్తున్న జర్నలిస్ట్‌లపై సర్కార్‌ వేధింపులకు గురి చేస్తుంది.కిడ్నాప్‌లు, అరెస్ట్‌లు చేస్తూ హింసిస్తుంది. నదీ సుందరీకరణ పేరుతో నాగరిక నిర్మాణానికి రాళ్లెత్తిన బీదల బతులకు కూల్చుతున్నారు.

లగచర్ల ఫార్మా కంపెనీల కోసం కోసం మొదలైన విధ్యంసం దిలాస్‌పూర్‌ ఇథనాల్‌ నుంచి మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతల నుంచి ఇప్పుడు ఏకంగా గ్రామాలు జిల్లాలకు కూడా విస్తరించింది.తాజాగా ఖమ్మంలో పేదల ఇళ్లను ప్రభుత్వం రాత్రి రాత్రే కూల్చేసింది. ప్రజల జీవించే హక్కును కాంగ్రెస్ భూ మాఫియాతో హరిస్తుంది. అర్థరాత్రుళ్ళు దొంగల్లా పవర్‌ కట్, ఇంటర్‌ నెట్ కట్‌ చేస్తూ పేదల నుంచి భూములు గుంజుకుంటూ ప్రభుత్వమే అధికారికంగా భూ దోపిడీకి దిగుతుంది. నాడు ఇందిరమ్మ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే నేడు అదే కాంగ్రెస్ ఆ ఇళ్లపైకి బుల్డోజర్లు ఎక్కిస్తుంది.పేదల ఇళ్లపైకి పోలీసు కావాత్‌, జేసీబీల కవాత్‌ నడిపిస్తుంది.

అంతేకాదు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందంటే ప్రజల దగ్గరకు జర్నలిస్ట్‌లను కూడా వెళ్లనీయడం లేదు.జనాల సమస్యలను కవర్‌ చేయకుండా మీడియాపై ఆంక్షాలు విధిస్తుంది.పత్రిక స్వేచ్చకు హరిస్తుంది.మేథావులను మాట్లాకుండా చేస్తుంది.పౌర సంఘాలు స్పందించకుండా అణచివేస్తోంది. పత్రికలను రాయనియ్యడం లేదు..టీవీలను చూపియ్యనీయడం లేదు.ఇక సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తే పోలీసులే గుండాల్లా వ్యహరిస్తూ కిడ్నాప్‌లు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంత నియంతలా వ్యవహరిస్తుందంటే, ప్రజల దగ్గరకు జర్నలిస్ట్‌లు పోతే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని వారిని అడ్డుకుంటుంది..అరెస్ట్‌ లు చేస్తుంది. ప్రభుత్వం చేస్తున్న విధ్వంస విధానాలు ప్రజలకు తెలియకుండా మీడియాను అణచివేస్తుంది. ఖమ్మంలో ప్రభుత్వం కూల్చివేతల కవరేజ్‌ కోసం వెలుతున్న జర్నలిస్ట్‌లను కాంగ్రెస్‌ సర్కార్‌ అక్రమంగా అరెస్ట్‌ చేసింది. ఇదేనా కాంగ్రెస్‌ పార్టీ ఏడో గ్యారంటీ, ఇదేనా ప్రజాస్వామ్య రాజ్యాంగా పాలన అంటే.ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్లకు కాంగ్రెస్‌ కూలగొట్టడమే ఇందిరమ్మ పాలన అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కమ్యూనిస్టులు, రెబల్ లెఫ్ట్ పార్టీలు మేమే స్ట్రాంగ్ ఉన్నామని చెప్పుకునే ఖమ్మం, మహాబూబాబాద్ జిల్లాలో, నల్గొండలో బలంగా ఉన్నామని చెప్పుకునే ఎర్రన్నలు ఇప్పుడు ఎక్కడున్నారో. వాళ్లు బలంగా ఉన్నామనే ప్రాంతాల్లోనే , పొత్తులో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చుతోంది కనిపించడం లేదా..?. లేదా కాంగ్రెస్ తో, ప్రభుత్వంతో వైరం ఎందుకని కళ్ళు మూసుకున్నారా..?. అక్కడ పేదల గూళ్ళు కూల్చుతుంటే కనీసం మాట్లాడటం లేదు.ఒకవైపు కళ్ళ ముందే పేదల ఇళ్లు కూల్చుతోంటే.స్పందించని మీ పోరాటాలు ఎందుకు.?. మీ భూ పోరాటాలు ఎవరి కోసం..?.ఇక్కడ కూల్చుతున్నది పేదల ఇళ్లు మాత్రమే కాదు. మిమ్మల్ని నమ్ముకుని, మీరున్నారే ధైర్యంతో ఇళ్లు కట్టుకున్న పేదల నమ్మకాన్ని అని గుర్తు పెట్టుకోండి. అక్కడ ప్రభుత్వం కూల్చుతోంది పేదల ఇళ్లు మాత్రమే కాదు కమ్యూనిజాన్ని. అక్కడ ప్రభుత్వం కూల్చుతుంది.. కమ్యూనిస్టు సిద్దాంతాన్ని. కమ్యూనిజానికి పునాదులైన పేదల ఇళ్ల పునాదులు కూల్చుతుంటే కమ్యూనిజం ఎలా మనుగడ సాధిస్తుంది.?.

.అంతేకాదు, అధికారంలోకి వస్తే రాజ్యాంగం అమలు చేస్తామని, ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఏకంగా గ్రామాల్లో ఫ్యూడల్‌ వ్యవస్థను పునర్మిస్తుంది. పల్లెల్లో కుల ఆధిపత్య రాజకీయాలు ప్రోత్సహిస్తుంది. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఆధిపత్య కులాలు ఎలా కింది కులాలు, సామాజిక బాధ్యతను మోసే కులాలను, సేవా కులం, ఉత్పత్తి కులాలను నోట్లో మూత్రం పోస్తూ ఎలా అవమానిస్తూ అణచివేశారో కనిపించింది.గ్రామాల్లో మళ్లీ భూస్వామ్య వర్గాలు కోరలు చాస్తుందనడానికి కుమ్మెర గ్రామంలో రెండు నెలల పాప హత్య విస్తరిస్తున్న ఫ్యూడలిజానికి నిదర్శనం. అటు విశ్వవిద్యాలయాల్లో కుల రక్కసి ఎలా బుసలు కొడుతోంది. మూకోన్మాదం పెరుగుతుంది.

తెలంగాణలో ముఖ్యంగా కమ్యూనిస్ట్‌ ఉద్యమాలు బలంగా ఉన్న ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చివేస్తుండగానే మరోవైపు తెలంగాణలో ఒక చరిత్రాత్మక ఘట్టం జరిగింది. ఏ భూస్వామ్య అణచివేతలు, ఫ్యూడల్ విధానాలకు, కుల అణచివేతలకు, అసమానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో ఉవ్వేత్తు ఎగిసిన మావోయిస్టు‌ పార్టీకి చెందిన టాప్‌ లీడర్స్‌ ప్రభుత్వం దగ్గర సరెండర్‌ అయ్యారు.అయితే ఒకవైపు గ్రామాల్లో కుల రక్కసి బుసలు కొడుతోంది..మరోవైపు ప్రభుత్వమే పేదల ఇళ్లను కూల్చుతుంది. ఇంకోవైపు ప్రభుత్వం, దాని అనుమాయిలు చేస్తున్న దాష్టీకాలపై కమ్యూనిస్ట్ పార్టీలు మౌనంగా ఉంటాయి.ఇవన్నీ జరగడం యాదృచ్ఛికం.

అయితే ప్రభుత్వంగానీ, లొంగిపోయిన మావోయస్ట్‌లుగానీ చెప్పుతున్న కారణం ఒక్కేటే సమాజంలో చాలా మార్పు వచ్చింది.ఫ్యూడల్‌ విధానాలు లేవు, ప్రజల మధ్య అసమానాతలు తగ్గాయి.కులాల మధ్య తేడాలు లేవు, పేదలపై అధిపత్య వర్గాల దోపిడీ లేదు.శ్రమ దోపిడీ పోయింది..సమానావకాశాలు పెరిగాయని చెపుతుండగానే మరోవైపు కళ్ల ముందే గ్రామాల్లో భూస్వాములు రెచ్చిపోతున్నారు.ఆధిపత్య వర్గాలు, కులాలు కింది కులాలను అణచివేస్తున్నాయి.దాడులు చేస్తున్నారు.ఏ నక్సలిజంతో అయితే గ్రామాల్లో భూస్వామ్య విధానాలు తగ్గాయో,మళ్లీ ఇప్పుడవి కోరలు చాస్తుంటే అవేవి లేవంటూ లొంగిపోవడం సిద్ధాంత వైఫల్యం కాదు, రాజకీయంగా, చైతన్యంగా దిగజారుడు అవుతుంది.అలా అని అమరులు కావాలని కోరుకోవడం లేదు. కానీ సమస్యలు లేవని లొంగుబాటు ప్రకటన ఆక్షేపణీయం.

పేదలపై ఆగ్ర వర్ణాల దాడులు పెరిగాయి.నిరుద్యోగం పెరిగింది.ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగాయి.శ్రమ దోపిడీ తగ్గలేదు. అది రూపంతరం చెందింది. కులాలు పోలేదు.కుల ఆధిపత్యం తగ్గలేదు. పేదలను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వ విధానాలు పోలేదు. దోపిడీ, అణచివేతలు, వేధింపులు ఒక రూపం నుంచి ఇంకో రూపం సంతరించుకున్నాయి తప్ప తొలిగిపోలేదు.అవి తొలిగిపోయాయి కాబట్టే తాము సాయుధ పోరాటం నుంచి వైదొలుగుతున్నామని చెప్పటం ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది. ఇలా ఒకే రోజు ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజల జీవించే, ప్రశ్నించే హక్కులను ప్రభుత్వం హరిస్తుంటే మరోవైపు దేశంలో అణచివేతలు, అసమానాతలు, ఫ్యూడల్ విధానాలు పోయాయంటే విప్లవ పార్టీ కీలక నేతలు రాజ్యం ముందు సరెండర్‌ కావడంతో తెలంగాణలో రెండు చరిత్రాత్మక ఘట్టాలు జరిగాయి. ఇవి దేశ చరిత్రలోనే ప్రపంచ విప్లవ చరిత్రలో నిలిచిపోయాయి.

అయితే ఇక్కడ ఆశాజనకమైన విషయం ఏంటంటే మావోయిస్ట్‌ పార్టీ కీలక నేతల్లో కొందరు అమరులైనా, మరి కొందరు లొంగిపోయినా ఇప్పటికీ ఆ పార్టీ ఉనికిలోనే ఉంది. రాజ్యం చెప్పినట్లు దానికి ముగింపు పడలేదు. ఇప్పుడు ఆరంభమైంది. ఎలా అంటే ఆ పార్టీని ఇప్పుడు నడిపిస్తున్న వారిలో కీలక స్థానాల్లో మెజార్టీ మహిళ కామ్రేడ్స్‌ ఉన్నట్లు డీజీపీ ప్రకటించిన లిస్ట్‌లో ఉన్నారు. నాడు ఫ్యూడల్‌ వ్యవస్థలో అయినా ఇవాళ కార్పొరేట్‌ వ్యవస్థలో అయిన శారీరక, మానసిక అణచివేతకు గురవుతున్నది స్త్రీలే..ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇక ముందు మావోయిస్టు పార్టీని మహిళలే లీడ్ చేసే అవకాశం ఉంది. ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు స్త్రీకి కొత్త కాదు. బానిస సమాజం నుంచి నేటి వరకూ స్త్రీ పోరాటం, అమ్మ త్యాగం లేనిదెక్కడ. వ్యవసాయాన్ని కనిపెట్టిన స్త్రీకి విప్లవ సాగు చేయడం అసాధ్యం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *