దేశ అభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ అధికారుల పాత్ర కీలకం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, సుపరిపాలనలో సివిల్ సర్వీసెస్ అధికారులు పోషించే కీలక పాత్రను స్మరించే రోజుగా ఈ దినం నిలుస్తుందని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

ప్రజాప్రయోజన విధానాల రూపకల్పన, అమలులో సివిల్ సర్వీసెస్ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని, వారి అంకితభావంతో కూడిన సేవ రాష్ట్ర, దేశ పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సమగ్రత, జవాబుదారీతనం, ప్రజా సంక్షేమ విలువలను నిలబెట్టడంలో వారి ప్రయత్నాలను ప్రశంసిస్తూ, సివిల్ సర్వీసెస్ అధికారుల అచంచల నిబద్ధత, వృత్తి నైపుణ్యాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *