– ఇది కాంగ్రెస్, బీజేపీల కుట్ర
– రెండు కిలోమీటర్ల వరకు వినిపించిన బాంబుల శబ్దాలు
– మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో స్థానిక ఇంజినీర్ ఫిర్యాదు
-174/2023 కింద కేసు నమోదు
-పోలీసులు ఎందుకు విచారణ జరపలేదు
– ఇసుక కుంగితే పిల్లర్లకు పగుళ్లెలా వస్తాయి?
– ఎన్నికల ముందే బ్యారేజీ కృంగటమేంటి?
– సీబీఐ విచారణ జరపాలి
-ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు
మేడిగడ్డ బ్యారేజీ వద్ద అక్టోబర్ 21, 2023న పెద్ద ఎత్తున బాంబులు పేలిన శబ్దాలు సుమారు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయని తెలంగాణ భవన్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే ఈ పేలుళ్లపై స్థానిక ఇంజనీర్ రవికాంత్ మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 174/2023 కింద కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. కానీ ఇప్పటి వరకు తిరిగి కేసు గురించి పట్టించుకోకపోవడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదులో అసాంఘిక శక్తులు బ్యారేజీని కూల్చడానికి కుట్రలు చేసినట్లుగా అనుమానం ఉందన్నారు. కానీ పోలీసులు ఎలాంటి ఎటువంటి విచారణ జరపలేదు. అలాగని సాక్ష్యాలు లేవన్న కారణంగా కేసు మూసివేయలేదు. గత రెండేళ్లుగా కేసు అలాగే పెండింగ్ లోనే ఉంది. పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్,బాంబ్ స్క్వాడ్,జెలెటిక్స్ ఎక్స్ ప్లోజన్ డిటెక్టివ్ పరీక్షలు నిర్వహించాల్సింది. పిల్లర్ సాంపుల్స్,ఇసుక సాంపుల్స్,సీస్ పిక్ రిపోర్టు తీసుకొని సంబంధిత శాఖా ల్యాబ్ కు పంపి పరీక్ష చేయాల్సింది. కానీ అటువంటిదేమీ ఇంతవరకు అటువంటి పనులేవీ చేయలేదు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అప్పటికే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న ఆనాటి ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి,బండి సంజయ్,కిషన్ రెడ్డి ల కాల్ డేటా, కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద ఆ రోజు తిరిగిన అనుమానాస్పద వ్యక్తుల కాలా డాటా సేకరించాల్సిందని, కానీ పోలీసులు ఆ పని చేయలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తెలిసిన వెంటనే కిషన్ రెడ్డి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వారికి లేఖ రాశారు. కాళేశ్వరం కాదు,కూలేశ్వరం అని ఉద్దేశ్యపూర్వకంగా ఆరోపణలు చేశారు.లక్ష కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులో, లక్ష కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.





