ఎందరెందరి చేతుల మీద సిగాచి కార్మికుల నెత్తురు?

కాని ఆ నిర్లిప్తతను వదిలి, లోతుగా ఆలోచిస్తే సిగాచీ దురంతాన్ని వాస్తవంగా మారణకాండ అనాలి. యాజమాన్యం, ప్రభుత్వ సంస్థలు ఎన్నో ఏళ్లుగా పరిశ్రమ నిర్వహణలో చూపిన బాధ్యతా రాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ జరిగిన మరణాల స్థాయి అనూహ్యమైనది కావచ్చు గాని, ఏదో ఒక స్థాయి దుర్ఘటన జరగడానికి అన్ని ఏర్పాట్లూ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఆ దుర్ఘటన ఒక సమయం కోసం వేచి చూస్తున్నది. ఆ దుర్ఘటనకు యాజమాన్యమూ, అధికార యంత్రాంగమూ ఎట్లా బాధ్యత వహించవలసి ఉన్నదో చూపడానికి ఎన్నో ఆధారాలున్నాయి.

telanganardhamనగరానికి కూతవేటు దూరంలో పాశమైలారం పారిశ్రామిక వాడలో జూలై 1న జరిగిన ఘోర ప్రమాదం కేవలం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న విషాదకర దుర్ఘటన మాత్రమే కాదు, అది మన అభివృద్ధి నమూనాలోని దుర్మార్గానికీ, మన పాలనా వ్యవస్థలో, అధికార యంత్రాంగంలో బలిసిపోయిన అక్రమాలకూ, అలసత్వానికీ, నిర్లక్ష్యానికీ, మనిషి ప్రాణం పట్ల విలువలేనితనానికీ కొట్టవచ్చినట్టు కనిపించే భయానక హెచ్చరిక కూడా. ఇటువంటి హెచ్చరికలు ఎన్ని అందినా దున్నపోతు మీద వాన అనే నుడికారంలో లాగా మన అధికార వ్యవస్థకు ఎంతమాత్రం స్పందన లేదు. (నిజానికి ఇది దున్నపోతులకు కూడా అవమానం, కాని అంతకన్నా మరొక తగిన పోలిక లేదు గనుక అది వాడవలసి వస్తున్నది. దున్నపోతులు క్షమించాలి!). ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా, ఎన్ని కుటుంబాలు ధ్వంసమైపోయినా పరిష్కార చర్యలు ఆలోచించని, అమలులో పెట్టని మన ప్రభుత్వ అధికార యంత్రాంగం గురించి హెచ్చరిక ఇది. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ స్పందించని, ఆగ్రహావేశాలు ప్రకటించని, తక్షణ ఆగ్రహం ప్రకటించినా, మర్నాటికి మరిచిపోయే మనలో ప్రతి ఒక్కరికీ కూడా మరొక హెచ్చరిక ఇది. సిగాచి కార్మికుల నెత్తురు మనందరి చేతులా మీదా ఉన్నది.

మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్, ఇతర సెల్యులోజ్ పదార్థాలు ఉత్పత్తి చేసే గుజరాతీ పెట్టుబడిదారుల సిగాచీ ఇండస్ట్రీస్ పాశమైలారం కార్ఖానాలో స్ప్రేయర్ డ్రయ్యర్ లో ఉష్ణోగ్రతలు పెరిగి, అది పేలడంతో అది ఉన్న భవనం, చుట్టూ ఉన్న నిర్మాణాలు కూలిపోయాయి. భారీ యంత్ర పరికరాలు కాలిపోయాయి. పేలుడు తీవ్రతతో రెండు కి.మీ. వరకు భూమి కంపించింది. ఇప్పటికి నలబై నాలుగు మంది మృతుల లెక్క తేలింది. మరొక ఎనిమిది మంది ఆచూకీ, కనీసం తగులబడిపోయిన శరీర చిహ్నాలు కూడా దొరకలేదు. అంటే ఆ ఎనిమిది దేహాలు ఏ ఆనవాళ్లు లేనంతగా ఆవిరి అయిపోయాయన్నమాట. ఈ మరణాలలో కొన్ని మూడు అంతస్తుల భవనం కుప్ప కూలడం వల్ల శిథిలాల కింద అణగిపోయి, భారీ యంత్రభాగాలన్నీ పగిలిపోయి చెల్లాచెదరుగా పడినందువల్ల జరిగినవి కాగా, అత్యధిక మరణాలు అక్కడ వెలువడిన మంటల ఉష్ణోగ్రతా తీవ్రత (700-800 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చునంటున్నారు) వల్ల జరిగినవి. ఆ ఉష్ణోగ్రత దాదాపు విద్యుత్ దహనవాటికల్లో మృతదేహాలను దహనం చేయడానికి ఉపయోగించే ఉష్ణోగ్రతకు (800-1000 డిగ్రీలు) దగ్గరగా ఉంది. అంటే మృతులలో చాలా మంది క్షణాల్లో సజీవంగా దహనమైపోయారు, కరిగిపోయారు, ఆవిరైపోయారు. మృతుల, వారి కుటుంబాల హృదయ విదారక విషాద గాథలు గత వారం రోజులుగా ప్రచార సాధనాలలో హోరెత్తుతూనే ఉన్నాయి.

అయితే దాన్ని “ప్రమాదం” అనే మాటకు ఉన్న అసలు అర్థంలో అకస్మాత్తుగా, అనూహ్యంగా జరిగిన ఘటన అని అనవచ్చునా? లేక, లాభాపేక్షతో యాజమాన్యం, అవినీతితో ప్రభుత్వ పర్యవేక్షక సంస్థలు ఏళ్ల తరబడి సాగించిన అలసత్వానికీ, నిర్లక్ష్యానికీ పర్యవసానం అనాలా? “ప్రమాదం” అనే మాటకు ఎవరి బాధ్యతా లేకుండా, దానంతటదే, దైవవశాన, బాధితుల విధి లిఖితంగా జరిగిన ఘటన అనే అర్థాలున్నాయి. ప్రమాదం అనగానే అదేదో అనూహ్యంగా, మనిషి చేతిలో లేని కారణాలతో జరిగిపోయిన ఘటన అనుకుంటారు. బాధితుల, హతుల కర్మ పరిపాకం వల్ల జరిగిన ఘటన అని కూడా కొందరు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఎక్కువలో ఎక్కువ బాధితుల పట్ల జాలి చూపుతారు. అంతే. ఆ ఘటనకు కారణాలు అన్వేషించి, బాధ్యులను విచారించాలని, శిక్షించాలని, అటువంటి కారణాలు లేకుండా చేయాలని ఎవరూ అనుకోవడం లేదు. ప్రభుత్వాలు కూడా అనుకోవడం లేదు. ఎట్లాగూ మన సమాజంలో కర్మ సిద్ధాంత ప్రభావం బలంగా ఉంది గనుక, మనిషి ప్రాణాలకు ఎట్లాగూ విలువ లేదు గనుక చచ్చినవారి కోసం ఒకటో రెండో కన్నీటి బొట్లు విడిచి, మృతుల లలాట లిఖితం వల్ల వారి కర్మ అక్కడ అట్లా తెల్లవారిందని జవాబు చెప్పుకుని, సంతృప్తి పడి రోజువారీ గానుగెద్దు వ్యవహారాలలో మునిగిపోయేవారే ఎక్కువ. ఆ ప్రమాదానికీ, మరణాలకూ కారకులైన పరిశ్రమల యజమానులకూ కావలసినది ఈ నిర్లిప్తతే. అవినీతితో, ఆ పరిశ్రమాధిపతుల నుంచి ముడుపులు, ప్రమాదం ఎంత పెద్దదైతే, ఎంతమందిని చంపితే అంత ఎక్కువ ముడుపులు సంపాదించ వచ్చుననుకునే రాజకీయ నాయకులకూ, ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించవలసిన అధికార వర్గానికీ కావలసినదీ ఈ నిర్లిప్తతే.  

కాని ఆ నిర్లిప్తతను వదిలి, లోతుగా ఆలోచిస్తే సిగాచీ దురంతాన్ని వాస్తవంగా మారణకాండ అనాలి. యాజమాన్యం, ప్రభుత్వ సంస్థలు ఎన్నో ఏళ్లుగా పరిశ్రమ నిర్వహణలో చూపిన బాధ్యతా రాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ జరిగిన మరణాల స్థాయి అనూహ్యమైనది కావచ్చు గాని, ఏదో ఒక స్థాయి దుర్ఘటన జరగడానికి అన్ని ఏర్పాట్లూ ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. ఆ దుర్ఘటన ఒక సమయం కోసం వేచి చూస్తున్నది. ఆ దుర్ఘటనకు యాజమాన్యమూ, అధికార యంత్రాంగమూ ఎట్లా బాధ్యత వహించవలసి ఉన్నదో చూపడానికి ఎన్నో ఆధారాలున్నాయి.

మొత్తంగా ఈ పారిశ్రామిక వాడలలో భద్రతా ఏర్పాట్ల వైఫల్యాలు, కార్మిక చట్టాల ఉల్లంఘన, కార్మికుల ఆరోగ్యానికీ, రక్షణకూ, సంక్షేమానికీ సంబంధించిన కనీస సౌకర్యాల లేమి విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. సరైన భద్రతా ఏర్పాట్లు చేయడమంటే యజమానులు మరింత ఎక్కువ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే వారి లాభాలలో కొంత తగ్గించుకోవలసి ఉంటుంది. అందుకు యజమానులు ఎన్నటికీ సిద్ధపడరు. యజమానులు అటువంటి కార్మిక వ్యతిరేక ధోరణితో, లాభాపేక్షతో ఉంటారు గనుకనే, కార్మికుల పక్షాన ప్రభుత్వం ఒక సంక్షేమ రాజ్యంగా తన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. అందుకే ఎన్నో కార్మిక సంక్షేమ, కర్మాగారాల సక్రమ నిర్వహణ, కర్మాగారాల పర్యవేక్షణ చట్టాలూ నిబంధనలూ ఆదేశాలూ ఉన్నాయి. కాని ఆ చట్టాలనూ ఉత్తర్వులనూ అమలు చేయవలసిన ప్రభుత్వ శాఖలు – కర్మాగార, కార్మిక, ఉద్యోగ శిక్షణా, పరిశ్రమల, వాణిజ్య, కాలుష్య నియంత్రణా, పురపాలక, వైద్య, ఆరోగ్య, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖలు – లేదా ఆ శాఖల అధికారులు కార్ఖానాల యాజమాన్యాల దగ్గర నెలవారీ మామూళ్ల వసూలుకు తప్ప, తమ విధ్యుక్తధర్మమైన పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించచడానికి వెళ్లడం చాలా చాలా అరుదు.

మొత్తంగా ఈ పారిశ్రామిక వాడలలో భద్రతా ఏర్పాట్ల వైఫల్యాలు, కార్మిక చట్టాల ఉల్లంఘన, కార్మికుల ఆరోగ్యానికీ, రక్షణకూ, సంక్షేమానికీ సంబంధించిన కనీస సౌకర్యాల లేమి విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. సరైన భద్రతా ఏర్పాట్లు చేయడమంటే యజమానులు మరింత ఎక్కువ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే వారి లాభాలలో కొంత తగ్గించుకోవలసి ఉంటుంది. అందుకు యజమానులు ఎన్నటికీ సిద్ధపడరు. యజమానులు అటువంటి కార్మిక వ్యతిరేక ధోరణితో, లాభాపేక్షతో ఉంటారు గనుకనే, కార్మికుల పక్షాన ప్రభుత్వం ఒక సంక్షేమ రాజ్యంగా తన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. అందుకే ఎన్నో కార్మిక సంక్షేమ, కర్మాగారాల సక్రమ నిర్వహణ, కర్మాగారాల పర్యవేక్షణ చట్టాలూ నిబంధనలూ ఆదేశాలూ ఉన్నాయి. కాని ఆ చట్టాలనూ ఉత్తర్వులనూ అమలు చేయవలసిన ప్రభుత్వ శాఖలు – కర్మాగార, కార్మిక, ఉద్యోగ శిక్షణా, పరిశ్రమల, వాణిజ్య, కాలుష్య నియంత్రణా, పురపాలక, వైద్య, ఆరోగ్య, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ శాఖలు – లేదా ఆ శాఖల అధికారులు కార్ఖానాల యాజమాన్యాల దగ్గర నెలవారీ మామూళ్ల వసూలుకు తప్ప, తమ విధ్యుక్తధర్మమైన పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించచడానికి వెళ్లడం చాలా చాలా అరుదు.

మొట్టమొదట, సిగాచీ యాజమాన్యం ఏ ఒక్క విషయంలోనూ నిజం చెప్పడం లేదు. దుర్ఘటన జరిగిన రెండో రోజు ప్రమాదస్థలానికి వచ్చిన డైరెక్టర్ చిదంబరనాథన్ షణ్ముగనాథన్ ఈ కార్ఖానాను తాము లీజుకు ఇచ్చామని అన్నాడు. కంపెనీ వెబ్ సైట్ మీద ఈ కార్ఖానా పూర్తిగా కంపెనీ నిర్వహణలోనే ఉందని ఉంది. ఆయనే ఈ కార్ఖానాలో కాంట్రాక్టు కార్మికులెవరూ లేరని, అందరికందరూ తమ రెగ్యులర్ ఉద్యోగులేనని అన్నాడు. కాని వాస్తవంగా ఈ కార్ఖానాలో పని చేస్తున్న 197 మందిలో 110 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులని, 87 మంది కాంట్రాక్టు కార్మికులని తెలుస్తున్నది. మృతుల్లో, క్షతగాత్రుల్లో బిహార్, ఒడిసాలకు చెందినవాళ్లు ఉండడాన్ని బట్టి యాజమాన్యం, బహుశా తగిన నైపుణ్యం లేని చౌక కార్మికులను పెద్ద సంఖ్యలో నియమించుకున్నదని తేలుతున్నది. ప్రమాదసమయానికి 143 – 155 మంది ఉన్నారని అంటున్నారు గాని హాజరు రికార్డు కూడా తగులబడి పోయింది గనుక కచ్చితమైన లెక్క కూడ లేదు.

ఆరు నెలల కింద రాష్ట్ర ప్రభుత్వ ఫాక్టరీల శాఖ చట్టబద్ధ తనిఖీ చేసి తయారుచేసిన నివేదికలో ఈ కార్ఖానాలోని నిర్వహణ లోపాలు ఎన్నో బైటపడినప్పటికీ క్లీన్ చిట్ ఇచ్చిందని తెలుస్తున్నది. కార్ఖానా భవన నిర్మాణం గురించి “అన్నీ బాగున్నాయి” అని రాసినప్పటికీ, ముప్పై ఐదేళ్ల భవనం పటిష్టత తరిగిపోయినట్టు తెలుస్తున్నది. ఎక్కువ ఉష్ణోగ్రతకు, ఒత్తిడికి తగిన భద్రతా ఏర్పాట్లు చేశారా అనే ప్రశ్నకు ప్రభుత్వాధికారులు తాము స్వయంగా పర్యవేక్షించి చేశారనో, లేదనో చెప్పడం కాకుండా “ఏర్పాటు చేసినట్టు చెప్పారు” అని రాశారు! భవన నిర్మాణ పటిష్టత గురించి సంబంధిత అధికారుల నుంచి ధృవీకరణ తీసుకున్నారా అనే ప్రశ్నకు ”ఇది ఈ కంపెనీకి వర్తించదు” అని రాశారు! కార్ఖానాలోని డ్రయ్యర్, ఓవెన్ లను పర్యవేక్షించడానికి మేనేజర్, తదితర సిబ్బంది ఉన్నారా అనే ప్రశ్నకు ”అవసరం లేదు” అని రాశారు! మరొకవైపు, కార్ఖానాలో ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణం అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేవనీ, యంత్రాలు ఉన్న హాలుకు తగిన సంఖ్యలో బైటికి వెళ్లే మార్గాలు లేవనీ, అగ్నిమాపక సౌకర్యాలు లేవనీ, కార్ఖానాలో వైర్లు వేలాడుతున్నాయనీ, కార్మికులకు రక్షణ పరికరాలు లేవనీ, భద్రతపై అవగాహన లేదనీ, కార్ఖానాలో తప్పనిసరిగా ఉండవలసిన సంక్షేమాధికారి, వైద్య సిబ్బంది లేరని ఆ నివేదికే రాసింది. చివరికి కార్ఖానాలో మరుగుదొడ్ల పరిశుభ్రత కూడా సరిగా లేదని రాసింది. భవన నిర్మాణంలో తప్పనిసరిగా పాటించవలసిన సెట్ బ్యాక్ నిబంధనలను కూడా పాటించలేదని తెలుస్తున్నది. ఇంత దుర్ఘటన జరిగిందంటే ఆ కార్ఖానాలో ఉష్ణోగ్రత, ఒత్తిడి పెరగగానే ఆటోమాటిక్ గా అలారం మోగే వ్యవస్థ కూడా లేదని అర్థం. కనీసం అది ఉన్నా కార్మికులు వెంటనే సమస్యను పరిష్కరించడమో, బైటపడి ప్రాణాలు దక్కించుకోవడమో చేసి ఉండేవారు.

ఆ నివేదిక తర్వాత ఆరు నెలలు గడిచినా, మొక్కుబడిగా ఎత్తిచూపిన ఆ లోపాల సవరణ కూడా జరగలేదు. మామూళ్లు, లంచాలు మేసి, ‘అంతా బాగుంది’ అని రాసిన క్లీన్ చిట్ ప్రధానమైపోయింది. ఆ క్లీన్ చిట్ రాసిన చేతులకు ఇవాళ యాబై మంది కార్మికుల నెత్తురు అంటుకుని ఉంది. అటువంటి క్లీన్ చిట్ లను ఆమోదిస్తున్న ప్రభుత్వమూ, ఆ హంతకులకు క్లీన్ చిట్ లు ఇస్తున్న వ్యవస్థను కొనసాగనిస్తున్న మనమూ అందరమూ నేరస్తులమే.

ఇది కేవలం సిగాచి ఇండస్ట్రీస్ అనే ఒకానొక పరిశ్రమకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. మొత్తంగా హైదరాబాద్ చుట్టుపట్ల ఇరవై రెండు వేల చిన్నా పెద్దా కార్ఖానాలు నమోదై ఉండగా అందులో కనీసం పదహారు వేలు పని చేస్తున్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన కార్ఖానాల్లో కార్మికుల సంఖ్య యాబై వేల నుంచి ఒక లక్ష వరకు ఉండవచ్చు. అన్ని కార్ఖానాల్లోనూ కలిసి ఎనిమిది లక్షల మంది కార్మికులుండగా, ప్రతి పదహారు మందిలో ఒకరి నుంచి ప్రతి ఎనిమిది మందిలో ఒకరి వరకు కార్ఖానాకు వెళితే తిరిగి రాగలరో లేదో తెలియని స్థితిలో ఉన్నారు.

ఎక్కడో ఒక శాఖో, ఒక అధికారో నిజాయితీగా ఆ పని చేద్దామని అనుకున్నా, సిబ్బంది కొరత, పై అధికారుల నుంచి, రాజకీయ నాయకత్వం నుంచి అడ్డంకులు, ఆ పర్యవేక్షణకు, నిజాయితీ నివేదికలకు స్థానిక పోలీసులు, పెత్తందార్లు అడ్డుతగలడం సర్వసాధారణం. ఈలోగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో పారిశ్రామిక వ్యాపార వేత్తలకు ఎటువంటి ఇబ్బందీ కలిగించగూడదనే విధానాలతో ప్రభుత్వాలు వారికి బారాఖూన్ మాఫ్ అవకాశాలు ఇస్తున్నాయి. భద్రతా ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నామో లేదో తామే సొంత ధృవీకరణలు చేసుకోవాలనీ, ప్రభుత్వ అధికారులు వారిని “వేధించబోరనీ” ప్రభుత్వాలే చెపుతున్నాయి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *