20 సంవత్సరాల సంబరాలు ఎందుకోసం… ఎవరికోసం

మావోయిస్టు పార్టీ ని  ప్రశ్నించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ హక్కుల సంఘం

భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 26 : మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపధ్యంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ హక్కుల సంఘం పేరిట కరపత్రాలు , లేఖ విడుదల చేసారు. 20 సంవత్సరాల కాలంలో మావోయిస్టు పార్టీ ఏమి సాధించిందని ఆదివాసీ ప్రాంత అభివృద్దికి ఏమి చేసారని కరపత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికి కూడ ఆదివాసీ గూడాలకు తాగు నీరు, రోడ్లు , విద్య, వైద్యం అలాంటి సౌకర్యాలు మావోయిస్టు పార్టీ కల్పించిందా అని ప్రశ్నించారు. ఆదివాసీ దళిత బిడ్డల బతులకును ఛిద్రం  చేసి చదువులకు , ఉద్యోగాలjకు, ఉపాది కి దూరం చేసి ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ది సంక్షేమ ఫలాలు మాకు అందకుండా చేసినందుకా మావోయిస్టు పార్టీ సంబరాలు చేసుకుంటుందని ప్రశ్నించారు.

 

మావోయిస్టు పార్టీ  మాటలను, పాటలను నమ్మి పార్టీలో చేరిన సుమారు 5500 మా ఆదివాసీ బిడ్డలను పోగొట్టుకున్నందుకా మీరు సంబరాలు జరుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారా సమసమాజాన్ని స్థాపిస్తామని  నీ రాజ్యాంగం లో  రాసుకున్నప్పటికి ఆదిపత్య కులాలకు చెందిన వారే మీ పార్టీలో అగ్రనాయకులుగా చలామని అవుతున్నారని మావోయిస్టు పార్టీని విమర్శించారు. ఆదివాసీ దళిత బిడ్డలను అణగద్రొక్కుతూ ఇన్‌ఫార్మర్‌ నెపంతో నిల్పో లాంటి ఆడబిడ్డలను హత్య చేసినందుకా మీ సంబరాలు అని ప్రశ్నించారు.

 

అగ్రనాయకుల మధ్య తలెత్తిన ఆధిపత్య కులాల విభేదాలను  కప్పిపుచ్చుకునేందుకు  మా ఆదివాసీ బిడ్డల ఆట, పాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఎందుకు అని ప్రశ్నలు విసిరారు. మావోయిస్టులు హత్య చేసిన దళిత బిడ్డ నిల్పో మృతిపైన నిజ నిర్ధారణ ఇంతవరకు ఎందుకు జరుగలేదని మావోయిస్టు పార్టీని ప్రశ్నించారు. బూటకపు నూతన ప్రజా స్వామిక విప్లవం పేరుతో బాంబులు పేల్చి మా ఆదివాసీ బిడ్డలను బలి తీసుకున్నందున మీ సంబరాలు అని ప్రశ్నించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల ప్రగతి కోసం కృషి చేస్తుంటే బూజు పట్టిన సిద్ధాంతాలతో ప్రజాస్వామిక విప్లవం అని, సమసమాజం అని వీరు పగటి కలలు కంటు మా జీవితాలను, మా బిడ్డల భవిష్యత్తును సర్వ నాశనం చేస్తున్నారని మావోయిస్టు పార్టీలపై విమర్శలు కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *