హ్యామ్‌ రోడ్లకు త్వరలో టెండర్లు

ఆర్‌అండ్‌బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: రాష్ట్రర్రలో హామ్‌ మోడల్‌లో రోడ్ల నిర్మాణం జరపాలని నిర్ణయించామని, వీటిపై సీఎంతో సమావేశమై త్వరలో టెండర్లు పిలుస్తామని, ఆ వెంనే పనులు మొదలుపెడతామని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోడ్ల ప్యాకేజీకి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో మూడు గంటలకుపైగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక రూ.6500కోట్లతో గ్రామీణ రోడ్లకు టెండర్లు పిలిచామని, రోడ్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. పెండిరగ్‌ రోడ్లు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. తమ శాఖ రోల్‌ మోడల్‌గా ఉండేలా చర్యలు చేపట్టామని, పెండిరగ్‌ ప్రమోషన్స్‌, పోస్టింగ్స్‌ ఇచ్చామని వివరించారు. రోడ్లు తమ కోసమో, కాంట్రాక్టర్ల కోసమో కాదు.. ప్రజల కోసం.. దేశంలోనే తెలంగాణ రోల్‌ మోడల్‌గా ఉండేలా రోడ్ల నిర్మాణం చేపడతామని మంత్రి చెప్పారు. గ్రామీణ రోడ్లన్నింటినీ మూడేళ్లలో పూర్తిచేస్తామన్నారు. కాగా, రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రంలో మరణాల సంఖ్య ఎక్కువ ఉందంటూ రోడ్డు సేఫ్టీ కింద బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించి పనులు జరుపుతున్నామని వివరించారు. ట్రాఫిక్‌ ఇబ్బంది ఉన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని సీఎం అన్నారంటూ అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. చిన్న కాంట్రాక్టర్ల పెండంగ్‌ి బిల్స్‌ ఈనెలలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) విషయంలో ప్రధానిని, కేంద్ర మంత్రి గడ్కరీని త్వరలో కలుస్తామన్నారు. ఆరు లేన్ల రోడ్డు కోసం త్వరలో కేబినెట్‌ అమోదం లభిస్తుందని, టెండర్‌ ప్రక్రియ వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి తెలిపారు. దీంతో హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోతాయన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page