తెలుగు సినీ రంగానికి 7 అవార్డులు రావడం హర్షణీయం

– గద్దర్‌ ఫిలిం అవార్డులతో తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం
– సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 1: జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏడు అవార్డులు లభించడం పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి ఎంపిక కావడం, తెలంగాణలోని పల్లె ఆప్యాయతను కళ్లకు కట్టినట్లు చూపిన బలగం సినిమాలోని పాటలకు సంబంధించి కాసర్ల శ్యామ్‌కు జాతీయ అవార్డు లభించడం పట్ల మంత్రి వారికి అభినందనలు తెలిపారు. బేబీ, హను-మ్యాన్‌ చిత్రాలకు రెండేసి అవార్డులు. గాంధీ తాత చెట్టు చిత్రానికి సుకృతి వేణి ఉత్తమ బాలనటిగా ఎంపికవడం తెలుగు సినీ పరిశ్రమ ప్రతిభను చాటిచెప్తున్నవన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మొదటి సారి సినీ పరిశ్రమను తెలంగాణ గద్దర్‌ ఫిలిం అవార్డులతో సత్కరించి ప్రోత్సాహానికి శ్రీకారం చుట్టామనివాయన గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినీ రంగాన్ని నిలిపేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడిరచారు. అవార్డులు వరించిన చిత్రాలకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, అవార్డు వచ్చేలా సమష్టి కృషి చేసిన వారి బృందం మొత్తానికి మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *