కాళోజి జంక్షన్/ హన్మకొండ ప్రజాతంత్ర ఆగస్టు 21 : కాకతీయ విశ్వవిద్యాలయంలో మూడో రోజు వివిధ విభాగాలలో సెమినార్లు (Telangana Science Congress 2025) ఆద్యంతం ఉత్సాహంగా, ఆసక్తికరంగా కొనసాగాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇందులో పాల్గని విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రధానంగా అణు విద్యుత్ పర్యావరణం, వ్యవసాయ రంగం,ఆరోగ్య అంశాలపై పరిశోధన పత్రాలు శాస్త్రవేత్తలు సమర్పించి ప్రసంగించారు. గరువారం జువాలజీ విభాగం సెమినార్ హాల్ లో ఇక్రిశాట్ శాస్త్రవేత్త ఆచార్య ఎ.నారాయణ రావు “క్లైమేట్ రేసిలిఎంట్ ఇంటిగ్రేటెడ్ వీడ్ మేనేజ్మేంట్” అంశం పై ఉపన్యాసం ఇచ్చారు. కలుపు నివారణలో సాంకేతికత ప్రధాన భూమిక వహించిందన్నారు. సాధారణంగా కలుపు నివారణలో దిగుబడి పెరగడంతో పాటు ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయన్నారు. రసాయన శాస్త్ర విభాగం సెమినార్ హాల్ లో ఐఐటి ఆచార్య కిషోర్ నట్టే రసాయన, ఔషధ పరిశ్రమలో ఉపయోగించే ఉత్ప్రేరక సమ్మేళనాల ప్రభావం, పర్యావరణ పరిరక్షణలో పాత్రను వివరించారు. ఆచార్యులు విద్యార్థుల సందేహాలు నివృత్తి చేశారు.
భౌతిక శాస్త్ర విభాగ సెమినార్ హాల్ లో ముంబై, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ డి. విద్యాసాగర్ “రేడియోలాజికల్ ఎమర్జెన్సీ అండ్ ప్రిపేర్డు నెస్ఇన్ న్యూక్లియర్ మెడిసిన్“ అంశం పై మాట్లాడుతూ అణు వైద్య విభాగంలో రేడియోలాజికల్ అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలన్నారు. తీసుకోవలసిన పర్యవసానాలు జాగ్రత్తలు వివరిచారు.
గణిత శాస్త్ర విభాగ సెమినార్ హాల్ లో బెంగళూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సెస్ ఆచార్యులు ఆచార్య తిరుపతి గుడి మాట్లాడుతూ “డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ డైరిక్లెట్” పై ప్రసంగించారు. విభిన్న సమీకరణలు, ప్రవేశ విలువలు, షరతులు మానవ శరీరంలోని నుంచి వివరించారు.
ఫార్మసీ కళాశాల సెమినార్ హాల్ లో విశ్రాంత ఆచార్య డి.రామ్ బహు “ ఫ్యూచరిస్టిక్ మెడిసిన్- ఎక్స్పెక్టేషన్స్ అఫ్ ఇన్నోవేషన్స్ ఇన్ డ్రగ్ ఇండస్ట్రీ” అంశం పై కాన్సర్ నివారణ లో వస్త్తున్న డ్రగ్స్ గురుంచి మాట్లాడారు. ఔషధల ఆవిష్కరణ కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. నూతన సాంకేతకత ప్రజల లో మెరుగైన చికిత్స ల పై నమ్మకం పెరుగుతుందన్నారు.
ఫార్మసీ విభాగ మినీ సెమినార్ హాల్ లో గోవా ఐసిపిఓఆర్ శాస్త్రవేత్త డాక్టర్ వలీఉర్ రహమాన్ “ప్రెడిక్టింగ్ వెస్ట్ అంటార్కిటిక్ ఐస్ షీట్ కొలాప్స్ అండ్ సి లెవెల్ రైస్” అనే అంశం పై మాట్లాడుతూ పశ్చిమ అంటార్కిటిక్ ఐస్ షీట్ కూలిపోవడం, సముద్ర మట్టం పెరుగుదలపై అంచనా భవిష్యత్తులో జరిగే వాతావరణ మార్పులపై వివరించారు.





