ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాహకులకు పలు సూచనలు
డిసెంబర్ 8,9 తేదీలల్లో భారత్ ఫ్యూచర్ సిటీ లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు .. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వాహకులకు పలు సూచనలు చేసారు. “అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి.. సమ్మిట్ కు ప్రపంచ వ్యాప్తం గా ప్రతినిధులు హాజరవుతారు.. వివిధ దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొనే అవకాశం ఉంది.. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు.. పాస్ లు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీలు లేదు.. సమ్మిట్ కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదు.. శాఖల వారీగా పకడ్బందీగా అధికారులకు ఎంట్రీ ఉంటుంది.. ఏర్పాట్లను నేను ఎప్పటికప్పుడు పరిశీలిస్తాను… పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.. పార్కింగ్ కు ఇబ్బంది రావొద్దు… బందోబస్తు కు వొచ్చే పోలీస్ సిబ్బంది కి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలి… సమ్మిట్ కు హాజరయ్యే మీడియా కు తగిన ఏర్పాట్లు చేయాలి… భారత్ ఫ్యూచర్ సిటీ లో నిర్మిస్తున్న భారత్ స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.





