తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్..

  • రేవంత్  అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని పాలన
  • ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్..

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పాడిపోతుండటం ఆందోళనకరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఇటీవల విడుదలైన కాగ్ నెలవారీ   గణాంకాల  ప్రకారం, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 2023-24లో రూ.1,24,146.19 కోట్లు కాగా, 2024-25 నాటికి రూ.1,24,054.38 కోట్లకు తగ్గిపోయిందని, చివరకు రూ.91.81 కోట్ల తగ్గుదల నమోదైందని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో తప్ప రాష్ట్రంలో ఇంతటి తగ్గుదల ఎప్పుడూ కనిపించలేదని పేర్కొన్నారు. 2014-15 నుంచి 2022-23 వరకు బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ 12% సొంత పన్నుల ఆదాయ వృద్ధిని సాధించిందని కాగ్ వెల్లడించిందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని పాలన రాష్ట్ర వృద్ధి తగ్గుదలకు కారణమయ్యాయని మండిపడ్డారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *