దివ్యాంగుల‌కు శుభ‌వార్త‌

తెలంగాణ ప్ర‌భుత్వం వివాహం చేసుకునే దివ్యాంగుల‌కు మేలు క‌లిగే నిర్ణ‌యం తీసుకుందిఇద్ద‌రు దివ్యాంగులు వివాహం చేసుకున్నా రూ.ల‌క్ష ప్రోత్సాహం అందించేందుకు వీలు క‌ల్పిస్తూ  స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళ వారం ఆదేశాలు జారీ చేశారుగ‌తంలో వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులై వుంటే మాత్ర‌మే  రూలక్ష వివాహ ప్రోత్సాహాన్ని ప్ర‌భుత్వం నుంచి పొందే వీలుండేది.  ఇద్ద‌రు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఈ ప్రోత్సాహం వ‌ర్తించేది కాదుఅయితే విష‌యం తెలుసుకున్న మంత్రి సీత‌క్క చొర‌వ‌తో దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారుదశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతూ ప్ర‌భుత్వం జి.జారీచేసిందికొత్త జి..జారీతో ఇద్ద‌రు దివ్యాంగులు వైవాహిక బంధంతో ఒక్క‌టైనా ఈ ప‌థ‌కం ప్ర‌యోజ‌నం పొంద‌డానికి అర్హుల‌వుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *