త్వ‌ర‌లో తెలంగాణ ఎడ్య‌కేష‌న్ పాల‌సీ

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ బృందానికి తెలిపిన సీఎం రేవంత్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకు రానున్నట్లు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి త‌న‌ను క‌లిసిన హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ బృందంతో చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ బృందం స‌చివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను హిమాచల్ ప్రదేశ్ మంత్రికి రేవంత్‌రెడ్డి వివరించారు. 25 ఎకరాల సువిశాల స్థలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఒకేచోట మినీ యూనివర్సిటీ తరహాలో రూ.200 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక కమిటీని నియమించామని, త్వరలోనే పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి వివ‌రించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసేందుకు వీలుగా ప్రీ ప్రైమరీ విద్య అందించే విధానం అమలు చేయనున్నట్లు మంత్రికి వివరించిన సీఎంగ్రామీణ ప్రాంతాల్లో ప్రీ ప్రైమరీ చిన్నారులను పాఠశాలలకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే యోచన చేస్తున్నట్లు తెలిపిన సీఎంరాష్ట్రంలో ఐటిఐ లను ఏటీసీ లు గా తీర్చిదిద్దుతున్న ట్లు వివరించిన ముఖ్యమంత్రి.. ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు  తెలిపిన సీఎం ..మల్లెపల్లి ఐటీసీ ని సందర్శించాలని హిమాచల్ ప్రదేశ్ మంత్రి కి సూచించిన ముఖ్యమంత్రి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్  నిర్మాణం పైన ఆసక్తి చూపించిన హిమాచల్ ప్రదేశ్ మంత్రి..ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర నివేదిక ను తమకు అందించాలని విజ్ఝప్తి . ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టతకు ముఖ్యమంత్రి విజన్ ను అభినందించిన హిమాచల్ ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *