“ఇన్ని రోజులు ప్రాంతీయ పార్టీలను చీల్చిన మోదీ ఇక ముందు కాంగ్రెస్ ను చీల్చుతామని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చడానికి కుటుంబ సభ్యులు, లాయలిస్ట్‌లకు ఎర వేసింది..దిల్లీ నుంచి గల్లీ వరకూ లోకల్ పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చామని మోదీ ప్రకటన సారంశంగా చూడాలి. విభజన పాలిటిక్స్‌తో బలం పెంచుకున్న బీజేపీ ఇక ముందు కాంగ్రెస్‌ను చీల్చి తమకు తిరుగులేదు, కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదన్నట్లు మాట్లాడారు..కాంగ్రెస్‌తో ప్రత్యేక్షంగానో పరోక్షంగా పొత్తులో ఉన్న మిత్ర పక్షాలకు కూడా మోదీ హెచ్చరించారు. ఎన్సీపీ, శివసేనలను చీల్చితే, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్‌లతో చిచ్చుపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. యూపీలో ఎస్పీలో కూడా చీలిక తేస్తామన్న తన అంతరంగాన్ని మోదీ బటయ పెట్టుకున్నారు. కాంగ్రెస్‌నే పరోక్షంగా చీల్చుస్తామన్న మోదీ కి ప్రాంతీయ పార్టీలోలెక్కనా.?.మోదీ వ్యాఖ్యలతో డీఎంకే తక్షణం అప్రమత్తంకాక పోతే స్టాలిన్‌కు భారీ నష్టం తప్పదు.”
టార్గెట్ రాహుల్..కాంగ్రెస్ చీలికకు మోషాలు కుట్ర..!

భారత దేశ ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వం వైపు వేగంగా అడుగులు వేస్తుంది.దేశాన్ని నిరంకుశత్వం దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నడిపిస్తుంది. సహజంగా ప్రజాస్వామ్యం ఒక్కసారిగా కుప్పకూలదు.అది చిన్న ఘటనల ద్వారా పలు దశల్లో ప్రజాస్వామ్యం నియంత పాలన వైపు అడుగులు వేస్తుంది. ఇందుకోసం అధికార పార్టీ తనకున్న అన్ని అవకాశాలను, వనరులను చివరికి ప్రభుత్వంలోని రాజ్యాంగబద్ధమైన అంగాలను కూడా తన నియంతృత్వ పాలన లక్ష్యంలో చురుకుగా ఉపయోగించుకుంటుంది.
కొన్ని రోజులుగా భారత దేశాన్ని కాషాయ పార్టీ .అందమైన స్లోగన్స్ తో ప్రజలకు భ్రమలు కల్పిస్తూ నియంతృత్వం దిశగా తీసుకుపోతుంది.ప్రజాస్వామ్యాన్ ని ఒక్కసారే రద్దు చేస్తే అది దేశంలో అంతర్ యుద్దానికి ప్రజల తిరుగుబాటుకు కారణం అవుతుందన్న ఉద్దేశ్యంతో ప్రజాస్వామ్య వ్యతిరేక పాయిజన్‌ను కొద్దీ కొద్దీగా ప్రజల మెదళ్లోకి ఎక్కిస్తుంది. రాజ్యాంగ సంస్థలను, ఎగ్జిక్యూటివ్, శాసన, ప్రెస్ అండ్ మీడియా చివరికి న్యాయ వ్యవస్థను బీజేపీ ఆయుధంగా మార్చుకుంటుంది.
బీహార్‌లో కాషాయ పార్టీ ఏకపక్ష విక్టరీతో మోషాలు మరింత దూకుడు పెంచారు.మత , హిందు రాజ్య రాజ్యస్థాపన లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ షాలు స్వతంత్ర, రాజ్యాంగ సంస్థలను, రాజకీయ పార్టీల వరకూ అన్నింటిని ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా నిర్వీర్యం చేస్తున్నారు. పౌరులను సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సంస్కృతిక ఒత్తిళ్లకు గురి చేస్తూ, తప్పని సరి పరిస్థితుల్లో నియంకుశపాలన, నియంతృత్వ ప్రభుత్వాలను అంగీకరించేలా ప్రజలను బీజేపీ మానసికంగా సిద్దం చేస్తుంది. అంతిమంగా జనాలు నియంత పాలనకు అలవాటు పడేలా భౌతిక, మానసిక పరిస్థితులను కల్పిస్తుంది.సహజంగా ప్రజాస్వామ్యం నిరంకుశం వైపు మొగ్గు చూపకుండా చిన్న చిన్న పోరాటాలు తాత్కాలికంగా నిలువరిస్తాయి. కుల పోరాటాలు, కమ్యూనిస్ట్, మావోయిస్ట్ ఉద్యమాలు, భక్తి ఉద్యమాలు, ప్రాంతీయ పోరాటాలు,భాషా సంస్కృతికోద్యమాలు, విద్యార్థి యువజన, మహిళా పోరాటాలు ప్రజాస్వామ్యాన్ని కూలిపోకుండా కాపాడుతాయి.వీటికి రాజ్యాంగం, దాని స్వతంత్ర అంగాలు కీలకంగా పని చేస్తాయి.
మోషాలు ప్రజలను ఇటు ప్రజాస్వామ్యవాదులను విభజించి .. . ప్రజా పోరాటాలను అణిచివేస్తుంది. ఆవేశంలో నిర్ణయాలు, సంతోషంలో వాగ్దానాలు చేయోద్దంటారు. తాజాగా బీహార్ గెలుపు ఆనందోత్సాహంతో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు..కాషాయ పార్టీ ఫ్యూచర్ ఎజెండా ఏంటో స్పష్టం చేశారు. బీహార్ తర్వాత తన లక్ష్యం ఏంటో ప్రధాని స్పష్టం చేశారు.త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తుందని ప్రకటించారు. దేశ ప్రధాని ప్రతిపక్షం చీలిపోతుందని ప్రకటించిన ఘనత ఒక్క మోదీ కే దక్కుతుంది.
అయితే మోదీ చేసిన కామెంట్స్ దేశ రాజకీయాలను కుదిపేయాలి. కానీ అలాంటి వాతావరణం కనిపించలేదు.దీని వెనుక కారణం కూడా ఉంది. రాహుల్ గాంధీ ఏ చిన్న వివాదాస్పద కామెంట్ చేసిన గోదీ మీడియా హడావుడి చేస్తుంది. కానీ అన్యోపదేశంగా వాస్తవాలు చెప్పిన మోదీ వ్యాఖ్యలపై మాత్రం గప్ చుప్‌గా ఉన్నాయి. ప్రధాని కుట్రల వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ లేకుండా బీజేపీ చేసింది. ఎందుకంటే మోదీ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఉద్దేశ్యమేంటో అర్థం అవుతుంది..వారి ఎజెండా ఏంటో తెలిసిపోతుంది. అది కాషాయ పార్టీ లక్ష్యాలను మరింత ఆలస్యం చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ చీలిపోతుందన్న వ్యాఖ్యలను ఎక్కువ హైలైట్ చేయలేదు.
ఇన్ని రోజులు ప్రాంతీయ పార్టీలను చీల్చిన మోదీ ఇక ముందు కాంగ్రెస్ ను చీల్చుతామని ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చడానికి కుటుంబ సభ్యులు, లాయలిస్ట్‌లకు ఎర వేసింది..దిల్లీ నుంచి గల్లీ వరకూ లోకల్ పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చామని మోదీ ప్రకటన సారంశంగా చూడాలి. విభజన పాలిటిక్స్‌తో బలం పెంచుకున్న బీజేపీ ఇక ముందు కాంగ్రెస్‌ను చీల్చి తమకు తిరుగులేదు, కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదన్నట్లు మాట్లాడారు..కాంగ్రెస్‌తో ప్రత్యేక్షంగానో పరోక్షంగా పొత్తులో ఉన్న మిత్ర పక్షాలకు కూడా మోదీ హెచ్చరించారు. ఎన్సీపీ, శివసేనలను చీల్చితే, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్‌లతో చిచ్చుపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. యూపీలో ఎస్పీలో కూడా చీలిక తేస్తామన్న తన అంతరంగాన్ని మోదీ బటయ పెట్టుకున్నారు. కాంగ్రెస్‌నే పరోక్షంగా చీల్చుస్తామన్న మోదీ కి ప్రాంతీయ పార్టీలోలెక్కనా.?.మోదీ వ్యాఖ్యలతో డీఎంకే తక్షణం అప్రమత్తంకాక పోతే స్టాలిన్‌కు భారీ నష్టం తప్పదు.
కాంగ్రెస్ చీలుతుందన్న ప్రధాని ఏ ఉద్దేశ్యంతో ప్రకటించాడో కానీ, కాంగ్రెస్‌లో మాత్రం కుదుపు మొదలైంది. ప్రధాని స్థాయి వ్యక్తి కాంగ్రెస్ చీలిపోతుందంటే సమాచారం లేకుండా, అందుకు సంబంధించిన రాజకీయ వ్యూహాలు లేకుండా ప్రకటించరు.అందులో మోదీ ప్రకటించడం అంటే దాల్ మే కుచ్ కాలా హై అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్‌ను దాని మిత్ర పక్షాలతో మోదీ సైకలాజికల్ మైండ్ అడారా, నిజంగానే చీల్చుతారా అంటే ఒక ప్రయత్నం అయితే జరుగుతుందని మోదీ ఒక హింట్ ఒక హెచ్చరిక ఇచ్చారనుకోవచ్చు. అయితే ఇప్పుడు మోదీ ప్రకటించినట్లు కాంగ్రెస్‌లో ఎలా చీలక వస్తుంది.అందులో బీజేపీ ప్రత్యేక్ష, మోదీ షాల పరోక్ష పాత్ర ఏంటీ..?. కాంగ్రెస్ లో చీలిక అంటే ఎలా సాధ్యం..?. ఏ అంశాల ప్రతిపాదికంగా చీలిపోతుందన్న చర్చ జోరందుకుంది.
కాంగ్రెస్ పార్టీని చీల్చడం అంటే గాంధీ కుటంబంలో చిచ్చుపెట్టడమే. కాంగ్రెస్ లో చీలిక అంటే గాంధీ కుటుంబంలో చీకలికే..కాంగ్రెస్ లో చీలిక అంటే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల మధ్య విభజన రేఖలు గీయడమే. అయితే సోనియా గాంధీ వయో భారంతో యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యాక్టీవ్‌గా ఉంటున్నారు. మోదీ చెపుతున్న చీలిక అంటే అన్నచెళ్లెళ్ల మధ్య చిచ్చు పెట్టడమే.అయితే ఇప్పటికే బీజేపీ ఆ ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు.కుట్రలు స్టార్ట్ చేయకుండా మోదీ స్థాయి నేత ప్రకటించరు.అంటే గత కొనేళ్లుగా ప్రియాంక, రాహుల్ మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్నా పవర్ పంచాయితీ త్వరలోనే బ్లాస్ట్ అవుతుందని, దానిని బీజేపీ తెరవెనుక నుంచి నడిపిస్తుందని మోదీ మాటల్లో వాస్తవం అంతర్లీనంగా దాగివుంది.
ప్రియాంక, రాహుల్ మధ్య చీలిక లేకపోతే అసలు కాంగ్రెస్ చీలిపోయే ప్రకస్తేలేదు.ఇంకెవరి మధ్య విభేదాలు వచ్చిన కాంగ్రెస్ చీలిపోతు. పార్టీ నుంచి ఎంత మంది బయటకు వెళ్లిన కాంగ్రెస్ గాంధీ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది.ఒక వేళ గాంధీ కుటుంబం చీలిపోతే కాంగ్రెస్ చీలిపోతుంది. మోదీ మాటలను గమనిస్తే గాంధీ కుటుంబంలో చీలికలుంటాయని అర్థం తెలుస్తుంది. రాహుల్ గాంధీ ముక్కసూటి తనం, సీనియర్లను లెక్కుచేయని తనంతో అసంతృప్తితో ఉన్న నాయకులు కొన్నేళ్లుగా ప్రియాంక గాంధీకి దగ్గరవుతున్నారు. రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రియాంక గాంధీతో పార్టీలో పావులు కదుపుతున్నారు..ఆ కోవాలలోనే తెలంగాణ సీఎం కూడా ఉన్నారన్న చర్చ ఉంది. రాహుల్ గాంధీ ఆలోచనలకు విరుద్దంగా రేవంత్ రెడ్డి ఆలోచనలుండటం, అదానీకి, ఈడీ, సీబీఐ విచారణ సంస్థలపై రాహుల్ చేస్తున్న పోరాటానికి విరుద్దంగా రాష్ట్రంలో రేవంత్ నిర్ణయాలు తీసుకోవడం..అవన్ని ప్రియాంక ఆలోచనలకు దగ్గర ఉండటంతో రేవంత్ ప్రియాంక వర్గమన్న చర్చ టీకాంగ్రెస్‌లో మొదలైంది.
.మోదీ చెప్పినట్లు కాంగ్రెస్ చీలిపోవడానికి రెండే మార్గాలున్నాయి.ఒకటి రాహుల్ , ప్రియాంక మధ్య చిచ్చు పెట్టడం.రెండోది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలతో బీజేపీ షిండే తరహా రాజకీయం చేయడం. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక లో బీజేపీ పావులు కదుపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే డీకే శివకుమార్ ను తేజస్వి సూర్య కలవడం, తెలంగాణ సీఎం రోజు రోజుకు డీకేకు దగ్గరవ్వడం అనుమానాలకు బలం చేకూరుతుంది..కర్ణాటక లో డీకేతో, తెలంగాణలో రేవంత్ తో పావులు కదుపుతున్నట్లు కనిపిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ చీలిపోతుందన్న ప్రధాని వ్యాఖ్యలను ఖంచకపోవడంతో కాంగ్రెస్‌లో ఏదో జరుగుతుందన్న అనుమానాలు క్యాడర్‌లో బలపడుతున్నాయి .మరోవైపు రాహుల్ గాంధీపై అర్బన్ నక్సలైటన్న ముద్ర బీజేపీ వేసింది. ఇప్పుడు మావోయిస్ట్ ముస్లీం కాంగ్రెస్ అని చెప్పడమంటే డెడ్ లైన్ పెట్టుకుని మావోయిస్ట్‌లను చంపేస్తున్నట్లే కాంగ్రెస్‌ను టార్గెట్ చేసినట్లు మోదీ ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.ప్రధాని ప్రకటనతో దేశంలో కాంగ్రెస్‌ను పూర్తిగా నిర్మూలించే కుట్రలు జరుగుతున్నాయన్నది సుస్పష్టం.
-తోటకూర రమేష్




