Tag #spirituality

ఆధ్యాత్మికత – రాజకీయం.. సమతుల్యతే ప్రజాస్వామ్యానికి బలము

“భారతదేశం వంటి బహుళత్వ సమాజంలో భక్తి వ్యక్తిగత విశ్వాసంగా, ప్రభుత్వ పాలన సామాజిక బాధ్యతగా కొనసాగాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవడం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు అత్యంత అవసరం..” భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలతో కూడిన ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తి దేశ సమగ్రతకు ప్రధాన ఆధారం. అయితే…

వ్యాపారీకరణ ముసుగులో చార్ ధాం యాత్ర

  మోక్ష మార్గంలో హిమాలయ సాక్షిగా మహా దోపిడీ – భీతిల్లజేసే నిజాలు భారతీయ సనాతన ధర్మంలో తీర్థయాత్రలకు అత్యున్నత ప్రాధాన్యత ఉంది. మోక్ష సాధనకు, ఆత్మశుద్ధికి ఇవి మార్గాలుగా భావిస్తారు. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో, ప్రకృతి రమణీయత నడుమ వెలిసిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించడం హిందువుల ఆధ్యాత్మిక…

జీవాల ఆలయం

కాలం కడలి అలలలో మనసుల ముత్యాలు ఎక్కడో జారిపోయాయి. నగరాల నీలి కాంతుల్లో నిజమైన వెలుగు నీడై మిగిలింది. అద్దాల భవనాల మధ్య అద్దంలా పారదర్శకమైన హృదయాలు చీలికలు పడ్డాయి.. కానీ ఆ చీలికల్లోంచి రాలిన రక్తం ఎవరికి కనిపించలేదు. వేగం వేదమై మారిన ఈ యుగంలో వెన్నెల మాటలు వాడుక తప్పాయి. కన్నీరును కూడా కరెన్సీ లాగా విలువ తూచే త్రాసులో కొలుస్తున్నారు. ఒకప్పుడు పేదవాడి పలుకులో పరమాత్మ ఉండేవాడు, పరాయివాడి బాధలో మనసు తడిచేది ఇప్పుడు.. తలుపులు పెద్దవయ్యాయి, కిటికీలు మూసుకుపోయాయి. కానరాని మానవతా ఆనవాళ్లు గుండెల గర్భంలో గుసగుసలాడుతున్నాయి. ఆశ్రయంలేని చూపుల్లో ఆర్తనాదాలై ప్రతిధ్వనిస్తున్నాయి. ఒక చిన్న చిరునవ్వు ఒక చిత్తశుద్ధి గల మాట ఒక కరుణామయ దృష్టి.. ఇవి విప్లవాల కంటే గొప్పవి ఎందుకంటే మానవత్వం పుస్తకాలలో పుట్టదు, పోరాటాలలో పెరగదు.. మనసు మరో మనసుని తాకినప్పుడు మాత్రమే అది పువ్వులా వికసిస్తుంది. మనం మనల్ని మించిన మనిషిని మరో మనిషిలో చూసిన రోజు, కాలం చెరిపేసిన ఆనవాళ్లు కాంతులా తిరిగి రాసుకుంటాయి. అప్పుడు.. ఈ భూమి కేవలం జీవుల గూడెం కాదు,…

యాదగిరి గుట్ట లో  తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు…

స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు… యాదగిరిగుట్ట,  ప్రజాతంత్ర, జులై 6:ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆషాడ మాసం తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద…