బాపు….
శీకట్ల లేశీ నేను వాకింగ్ పోతుంటే సల్లగత్తది బిడ్డ కుల్లబెట్టుకోమని నీ నెత్తిమీద కుల్ల తీశిత్తవేమోనని కొత్తింటి తలుపులకెల్లి ఆగాగి చూస్తున్న బాపు నేను జబ్బకు సంచేసుకుని బడికి పోతుంటే పైలంగ పోయిరా బిడ్డని చెబుతవేమోనని ఇంటిముందర కట్టిన ఫ్లెక్సీలనీ ఫోటువా కళ్ళల్లోకి యెనక్కి తిరిగి తిరిగి చూస్తున్న బాపు బాపూ….. తొవ్వెంట పోకుంటా నిన్ను…








