– లోక్‌సభ ఎన్నికలలో సంచలనాలను నమోదు చేసుకుంది
– భవిష్యత్తులోనూ అద్భుతమైన విజయాలు సాధించాలి
– నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకే మెగా జాబ్ మేళా
– పార్టీ యంత్రాంగం ఇందులో భాగస్వామ్యం కావాలి
– మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారిందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికలలో సాధించిన ఫలితాలే ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో యావత్ దేశంలోనే సూర్యాపేట జిల్లా సంచలన రికార్డులు నమోదు చేసుకుందన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీ సాధించగా కోదాడలో 97 వేలు, సూర్యాపేట, తుంగతుర్తిలలో 70 వేల మెజారిటీ సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగతన్ సృజన్ అభియాన్ సదస్సుతోపాటు నూతన డీసీసీల ఎంపిక కోసం హుజుర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బుధవారం కోదాడ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, డీసీసీ డెలిగేట్లు సిహెచ్.లక్ష్మీనారయణ రెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వంగవీటి రామారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ లోనూ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల అకుంఠిత దీక్ష, శ్రమ ఈ విజయాల వెనుక ఉన్నాయన్నారు. సమజానికి నిరుద్యోగ సమస్య పెను సవాల్‌గా మారిందన్నారు. అందుకే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 25న హుజుర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సుమారు 150 కంపెనీలు పాల్గొనే ఈ జాబ్ మేళాలో కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణి కాలరీస్, డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళలో పాల్గొనే వారందరికీ వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సారత్ రౌత్ మట్లాడుతూ దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఈ తరహా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేసేవరకు ప్రంష కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల అభీష్టానికి అనుగుణంగా నిఅవమకాలు ఉంటాయని, అందుకే అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





