– బీసీ రిజర్వేషన్లకు ఢోకా లేదు
– పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. దీన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని చెప్పారు. 8వ తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని మహేష్ కోరారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేష్ అన్నారు. బీసీ బిడ్డలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇస్తే కొందరు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ చిత్తశుద్దిగా ఉందన్నారు. బీజేపీ బీఆర్‌ఎస్‌లు చేస్తున్న కుట్రలను బీసీలు అర్థం చేసుకోవాలన్నారు. బీసీ బిడ్డల నోటి దగ్గర ముద్దను లాక్కోవద్దని హితవు పలికారు. బీఆర్‌ఎస్ నేతలు కుల సంఘ నాయకుని ముద్ర వేసుకుని కోర్టుకు వెళ్తున్నారని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పెంపును అడ్డుకునే ఉత్సాహాన్ని బీసీలు గమనిస్తున్నారని మహేష్ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



