‘యంగ్‌ ఇండియా‘ స్కూల్స్‌కు సహకరించండి

– కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం వినతి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (వైఐఐఆర్‌ఎస్‌) ఏర్పాటుకు సహకరించాలని విేజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 105 పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్‌రెడ్డి తీసుకెళ్లారు.
ఈ స్కూల్స్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా నాలుగు లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. ఈ రెసిడెన్షియ‌ల్‌ పాఠశాలల నిర్మాణం, ఇతర విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.30 వేల కోట్ల వ్యయమవుతుందని కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ మొత్తానికి తీసుకునే రుణాలకు ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాలని నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *