నామినేషన్‌ ‌వేసిన మాగంటి సునీత

– కెటిఆర్‌, ‌తలసాని తదితరుల హాజరు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌15: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ ‌తొలి సెట్‌ ‌నామినేషన్‌ ‌వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్‌ ‌కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్‌రెడ్డి, దీదీప్య రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజ్‌కుమార్‌ ‌పటేల్‌, ‌సనా యాస్మిన్‌తో కలిసి నామినేషన్‌ ‌పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ‌మృతి చెందడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం సోమవారం గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ పక్రియ ఉంటుంది. నవంబర్‌ 11‌న ఉప ఎన్నికల పోలింగ్‌ ‌జరుగనుండగా.. అదే నెల 14న కౌంటింగ్‌ ‌నిర్వహించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *