మాగంటి సునీత నామినేషన్‌ ‌సక్రమమే

– తిరస్కరించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ఈసీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,అక్టోబర్‌ 22: ‌జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగటి సునీత నామినేషన్‌ ‌సక్రమంగానే ఉందని ఈసీ• ధృవీకరించింది. ఆమె నామినేషన్‌పై అభ్యంతరాలను కూడా తోసిపుచ్చింది. జూబ్లీహిల్స్‌లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్‌, ‌సిట్టింగ్‌ ‌సీట్‌లో మళ్లీ పాగా వేసేందుకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆమె పిల్లలు సైతం ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఈ సమయంలో  దివంగత నాయకుడు మాగంటి గోపీనాథ్‌ ‌మొదటి భార్య తనయుడు ప్రద్యుమ్న బిగ్‌ ‌ట్విస్ట్ ఇచ్చారు. సునీత, మాగంటి గోపీనాథ్‌ అసలు భార్యా భర్తలే కాదని ఆరోపించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదని, లివ్‌ ఇన్‌ ‌రిలేషన్‌లో ఉన్నారంటూ బాంబ్‌ ‌పేల్చారు. ఎన్నికల కమిషన్‌కు సునీత ఇచ్చిన అఫిడవిట్‌ను రద్దు చేయాలన్నారు. ఈ మేరకు ఈసీకి ప్రద్యుమ్న వినతి పత్రం అందజేశారు. బుధవారం నాడు ఇదే అంశంపై డియాతో మాట్లాడిన ప్రద్యుమ్న.. సునీత మాగంటి గోపీనాథ్‌ ‌భార్య కాదన్నారు. తన తల్లి మాలినితో గోపీనాథ్‌కు విడాకులు కాలేదని ప్రద్యుమ్న చెప్పుకొచ్చారు. అంతేకాదు.. విడాకులు అవకుండానే గత ఎన్నికల సమయంలోనూ గోపీనాథ్‌ ‌తన అఫిడవిట్‌లో భార్య స్థానంలో సునీత పేరును పేర్కొన్నట్లు ఆరోపించారు. ఈ అంశంపై ఈసీ చర్యలు తీసుకోవాలని ప్రద్యుమ్న కోరారు. కాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఎలక్షన్‌ ‌కమిషన్‌.. ‌మాగంటి గోపీనాథ్‌కు సునీత రెండో భార్య అవునా కాదా అనే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. దీంతో మాగంటి సునీత నామినేషన్‌కు లైన్‌ ‌క్లియర్‌ అయ్యింది. అంతేకాదు.. ఆమె వేసిన నామినేషన్లను ఈసీ ఆమోదించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *