– ఇద్దరికీ కేబినెట్ హోదాతో నియామకాలు
– కేబినెట్ మీటింగ్‌కు హాజరయ్యేలా సుదర్శన్‌కు వెసులుబాటు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరు గ్యారంటీల అమలు బాధ్యతలు అప్పగించింది. కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన సుదర్శన్ రెడ్డికి ఇప్పుడు కీలకమైన బాధ్యత లభించడం, పార్టీ అంతర్గత రాజకీయాల్లో సమతుల్యత సాధించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన మరో సీనియర్ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావును సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మొత్తానికి, బుజ్జగింపు చర్యలు సఫలీ కృతమైనట్లు కాంగ్రెస్ భావిస్తోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల అమలు సలహాదారుడిగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సుదర్శన్ రెడ్డి కేబినెట్ సమావేశాలకు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన క్వార్టర్ కేటాయించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావుకు పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని ప్రభుత్వం అప్పగించింది. ఆయనకు కూడా కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





