– నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలి
– ఆటల్లో లీనమైతేనే జీవితం బాగుంటుంది
– మంత్రి వాకిటి శ్రీహరి
– అట్టహాసంగా సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: ఆటల్లో క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధ్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాతీయం గేయం వందేమాతరం..! తెలంగాణ రాష్ట్ర గీతం జయహే తెలంగాణ..తో సీఎం కప్ 2026 వేడుకలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వివిధ స్కూల్స్, కాలేజీల నుంచి వచ్చిన విద్యార్ధుల మార్చ్ తో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడల్లో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చారని గుర్తుచేశారు. అంతర్జాతీయ పోటీల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లనే విజయాలు సాధించలేకపోతున్నామన్నారు. క్రీడల్లో స్వార్థం, నైపుణ్యం ఉంటేనే రాణిస్తామన్నారు. బాల్యంలో ఒక లక్ష్యం పెట్టుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రతి క్రీడాకారుడు ఆటల మీద దృష్టి సారించాలన్నారు. ఆడాలనే కసి ఉంటేనే దేశం తరపున ఆడే అవకాశం వస్తుందన్నారు. ఆటలో లీనమై, అదే ప్రపంచం అనుకోని ముందుకు నడవండి. అప్పుడే జీవితం బాగుటుందన్నారు. గత ప్రభుత్వాలు ఆటలను పట్టించుకోలేదు. తెలంగాణ అంతటా క్రీడా స్ఫూర్తి నింపాలని ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. ఆటలను టైం పాస్ గా కాకుండా విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రం తరుపున ఆడాలనే స్ఫూర్తి ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో, శివమణి ప్రదర్శన ఆకట్టుకున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎం.డి. సోనీ బాలాదేవి తదిరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




