ఎరువుల కంపెనీలకు పోష‌క ఆధార సబ్సిడీ

-కంపెనీలకు రూ.37,952 కోట్ల చెల్లింపులు
-కేంద్ర కేబినేట్‌ ‌నిర్ణయం
– కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వివరణ

న్యూదిల్లీ, అక్టోబర్‌2 8: ఎరువుల ఉత్పత్తి కంపెనీలకు పోష‌క ఆధార సబ్సిడీ అమలు చేయాలన్న కేంద్ర కేబినెట్‌ ‌నిర్ణయంపై.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం గత 11 ఏళ్లుగా కారక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం కేంద్ర కేబినెట్‌ ‌మరో చారిత్రక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రైతులపై ఎరువుల ధరలు భారం పడకుండా, ఎరువుల ఉత్పత్తి కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రూ.37,952 కోట్ల పోష‌క ఆధార సబ్సిడీ  అమలు చేయాలని నిర్ణయించిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వివిధ కారణాలతో ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. ఈ ధరల ప్రభావం ఏమాత్రం రైతులపై పడకుండా చర్యలు తీసుకుంటోందని చెప్పుకొచ్చారు. ఈ ప్రయత్నంలో భాగంగా.. ఎరువుల ఉత్పత్తి కంపెనీలపై పడుతున్న భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఇవాళ సమావేశమైన కేంద్ర కేబినెట్‌.. 2025-26 ‌రబీ సీజన్‌కు సంబంధించి.. డై అల్యూమినియం ఫాస్పేట్‌, ‌మోనో అల్యూమినియం ఫాస్పేట్‌, ‌మ్యూరియేట్‌ ఆఫ్‌ ‌పొటాష్‌, ‌ట్రిపుల్‌ ‌సూపర్‌ ‌ఫాస్పేట్‌, 3 ‌గ్రేడ్స్ ఆఫ్‌ ‌సింగిల్‌ ‌సూపర్‌ ‌ఫాస్పేట్‌, ‌పొటాష్‌ ‌డెరైవ్‌డ్‌ ‌మొలాసెస్‌, అల్యూమినియం సల్ఫేట్‌ ‌వంటి దాదాపు 28  ఫెర్టిలైజర్స్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలకు న్యూట్రియెంట్‌ ‌బేస్డ్ ‌సబ్సిడీ అమలు చేయాలని నిర్ణయించిందని వివరించారు కిషన్‌రెడ్డి. ఇందుకోసం.. అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో ఈ ఎరువుల ఉత్పత్తి కంపెనీలపై భారం పడకుండా.. రబీ సీజన్‌ ‌కోసం రూ.37,952 కోట్లు కేటాయిస్తున్నట్లు కేబినెట్‌ ‌నిర్ణయించిందని వెల్లడించారు. ఇది ఎరువులు ఉత్పత్తి కంపెనీలకు కూడా భారం పడకుండా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *