తన మన బడి పిల్లలను వారి తల్లిదండ్రులను బహిరంగంగా దోషులను చేసి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు మేము కొట్టలేము తిట్టలేము అంటూ తమ పాఠశాల పిల్లలకు రాయడం చదవడం రాదని బహిరంగ పరిచి తన నిస్సహాయతను తన పాఠశాల ఉపాధ్యాయుల సామర్థ్యాలను నిస్సహాయతను పిల్లల ముందు ప్రజల ముందు గుంజీలు తీసి నిరసన తెలియ చేశారు. పిల్లల ప్రవర్తనను మార్చడం బడుల టీచర్ల పిల్లల అంతర్గత విషయం. అంతర్గత పరిష్కారమే మార్గం . వారిపై మానసిక ఒత్తిడి పెంచడం పరిష్కారమా అని ఆలోచించాలి. ఆ విద్యార్థులందరినీ తల్లిదండ్రులను వారి ప్రమేయం లేకుండా వారిని కించపరచాలని వీడియో ద్వారా రాష్ట్ర, దేశ ప్రజలకు చాటి చెప్పాలని తాను చదివిన ఏ శాస్త్రం లో ఉందో అర్థం కావడం లేదు.
ఈ చర్యకు కొంత మంది సమర్థన ఇంకా భయంకరం. ఈ చర్య పిల్లల మంచి కోసమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. దండన చేయకపోవడమే కారణం అని పిల్లల పట్ల విపరీతమైన ద్వేష భావం వ్యక్తమౌతున్నాయి. ఈ భావన ఉపాధ్యాయుల నుండి రావడం చాలా విచారకరం. ఈ సంఘటన మన ఉపాధ్యక్షుడు మానసిక స్థితి ని తెలియ చేస్తుంది. ఉపాధ్యాయుల శిక్షణ సంస్థల శిక్షణా లోపం అర్థం అవుతుంది. ముందుగా ఉన్నత వర్గాల పిల్లలు విడిచిపెట్టి వెళ్లినా పేద వర్గాల పిల్లల వలననే ప్రభుత్వ బడులు మనుగడ సాధిస్తున్నాయి.
వారిని బడికి పంపిన ప్రయోజనం లేదని బహిరంగంగా తల్లిదండ్రులకు చెప్పడం విచిత్రం. ఉపాధ్యాయులు ప్రభుత్వ బడులకు వస్తున్న పిల్లల నేపథ్యం అర్థం చేసుకుని మెలగాలి. వారి సామాజిక ఆర్ధిక నివాస ప్రదేశాల నేపథ్యం చాలా భిన్నమైనది. ఒక్కో విద్యార్థి ఒక నేపథ్యం. తరగతి గదికి వస్తున్న విద్యార్థుల మానసిక స్తితి గతులను వారితో సంభా షించే సమయం తీరిక మన బడులకు ఉండాలి. సమాజంలో జరుగుతున్న వివిధ మార్పులు మన పెద్దల మీద పడుతున్నట్లే పిల్లల మీద పడుతుంది. వారి భాష, వేషధారణ, నడక,ఆహారపు అల వాట్లు అన్నిటి మీద పడుతుంది. మన సమాజంలో అనుకరణాలకు కోదువలేదు. సినిమా హీరోల క్రికెట్ ఆటగాళ్ల వేషధారణ ప్రభావం ప్రతి యువతరం మీద పడుతుంది. ఉపాధ్యాయులు కూడా ఈ ప్రభావం నుండి వచ్చిన వారే అని గ్రహించాలి.
మన బడికి వస్తున్న పిల్లల కుటుంబాలు అత్య ధిక శాతం సామాజిక ఆర్ధిక వెనకబాటు నుండి చదువుకు కదిలిన కుటుంబాలు. ఇంకా చెప్పాలంటే అత్యధిక శాతం మొదటి తరం బడికి వస్తున్న పిల్లలు.మొదటి తరం తమ పిల్లలను బడికి పంపిస్తున్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బడికి పంపే నైపుణ్యాన్ని ఇప్పుడిప్పుడే అంది పుచ్చు కుంటున్నారు. బడి ద్వారానే పేదరిక విముక్తి సాధ్యం అని నమ్మిన తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళ పిల్ల లంటే అపురూపం. వాళ్ళను అగౌరవపరిచే ఏ పని అయినా భరించలేరు. బాలల మనోభా వాలను అర్థం చేసుకొవాడానికి పిల్లలను సమానంగా చూసుకోవడానికి వారితో హింస మార్గంలో కాకుండా సహృద్భావంతో మెలగడానికి ఉపాధ్యాయులు తగిన నైపుణ్యతను పెంచుకోవాలి. పెద్ద మనసుతో సమాజంలో పిల్లలపై ఉన్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడి వారి పక్షం వహించాలి.. కానీ వారిని వారి తల్లిదండ్రులను కించపరచ రాదు.
-వెంకట్ రెడ్డి





