– ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ సీపీఐ ఆందోళన
– విచారణ జరిపి బాధ్యులపై చర్యలు : డీఈవో
భీమదేవరపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో శుక్రవారం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన వనం మమత, తిరుపతి దంపతుల కుమార్తె శ్రీవర్షిత వంగర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. దీపావళి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థిని ఈనెల 23న గురువారం తిరిగి హాస్టల్ కు వచ్చింది. మరుసటి రోజు ఉదయం డార్మెటరీ గదిలో స్కూల్ యునిఫాంలో తన చున్నీతో వురి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిరది. గమనించిన విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలుపగా వర్షిత తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని హుజురాబాద్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. డీఈవో వాసంతి ఘటనపై స్పందిస్తూ ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రిన్సిపాల్ ఆఫ్రిన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు ఆదరి శ్రీనివాస్, కార్యకర్తలు, తల్లిదండ్రులు హాస్టల్ ఎదుట ధర్నా చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడిరచారు. తోటి విద్యార్థులతో వర్షిత కలిసిమెలిసి వుండేదని, చదువులో కూడా మెదటి స్థానంలో వుండేదని, ప్రస్తుతం క్లాస్ లీడర్‌గా వుందని స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తహసిల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, ఎంఈఓ సునీతారాణి, సీిఐ రమేష్, ఎస్సైలు దివ్య, రాజు, ప్రవీణ్ కుమార్, డాక్టర్లు రెహమాన్, రుబీనాలు గురుకుల పాఠశాలకు చేరుకొని సంఘటన వివరాలు తెలుసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





