మహిళల్లో నాయకత్వ లక్షణాలు మెండు

‘కిట్స్‌’లో ‘స్ట్రాంగ్ మైండ్స్- స్ట్రాంగ్ ఉమెన్‌’ విజయవంతం

వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మహిళల్లో బలం, స్థితిస్థాపకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ అండ్ బిహేవియరల్ స్కిల్స్ ట్రైనర్ స్వప్న శ్రీరాముల తెలిపారు. కిట్స్ వరంగల్‌లో మహిళా సాధికారత సెల్ 2025-2026కు సంబంధించిన పోస్టర్ ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి, డీన్ అకడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కె.వేణుమాధవ్, మహిళా సాధికారత సెల్ కార్యనిర్వాహక సభ్యులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా స్ట్రాంగ్ మైండ్స్-స్ట్రాంగ్ ఉమెన్ అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ కార్యక్రమం మహిళా సాధికారత, మానసిక ఆరోగ్యంపై అవగాహనను కలిగించింది. ఇది నాయకత్వ నైపుణ్యాలు, భావోద్వేగ సమతుల్యత, నిర్ణయం తీసుకోవడాన్ని పెంపొందించే వేదిక అని చెప్పారు. ఈ కార్యక్రమ స్ఫూర్తిని విద్యార్థి సంఘం సంపూర్ణంగా ప్రతిబింబిస్తుందని ప్రిన్సిపాల్ తెలిపారు. సామర్థ్యాలు, నైపుణ్యాలను సాధించడంలో మీ సమయాన్ని వెచ్చించండి.. బలమైన స్త్రీ తన కోసం నిలబడడమేగాక మిగతా వారందరికీ అండగా నిలుస్తుంది.. స్వీయ ప్రేరణ విజయానికి కీలకమని, బలమైన ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని సాధించాలి అని స్వప్న శ్రీరాముల సూచించారు. కార్యక్రమంలో కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ బిహేవియరల్ స్కిల్స్ ట్రైనర్ బెన్సెన్, డీన్ అకడమిక్ అఫైర్స్, ప్రొఫెసర్ కె.వేణుమాధవ్, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పిఆరఓ డాక్టర్ డి.ప్రభాకరాచారి, మహిళా సాధికారత సెల్ చైర్‌పర్సన్ ఇసిఇడి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.సౌజన్య, కన్వీనర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ V.గౌతమి, కార్యనిర్వాహక సభ్యులు కె.సంతోష్ భార్గవి, డా. బి.ధŠనలక్ష్మి, డా. అస్మతున్నీసా బేగం, డా. ఎన్. గాయత్రి, డా. ఎస్.సారిక, డా. డి.ప్రవీణ, డా. కె.శైలజ, ఎం.శిరీష, డా. ఎం.సుజాత, వీ.శ్వేతారాణి. నవీన్‌రాజ్, ఎ.స్వాతి, విద్యార్థి సమన్వయకర్తలు ఎం.స్మరణ, ఎ.రీతిక చౌదరి, ఎ.శ్రీష్ణ, ఆర్.సాయి సంజన రెడ్డి, జె.శ్రీనిధి, ఎ.సాయిచందన, కె.భవ్య, ఎ.శ్రీజ, కె.మనోజ్ఞ, ఎ.నాగదీప, కె.కోమలి, జి.జయరూప, యు.నిఖిత, బి.సౌమ్య శృతి, ఎస్.సౌమ్య కె.సాహితి, ఉ.వి.సువర్ణ జ్యోతి, బి.వర్షిణి, బి.దీక్షితారెడ్డి, వి.నందిని, వెన్నెల, హన్సిక 200 మందికి పైగా విద్యార్థినులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *