బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి
సంస్థ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 17: భవిష్యత్తు తరాలకు ఉపాధిని అందించే 45 వేలకు పైచిలుకు ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూపాలపల్లిలోని సింగరేణి జిఎం కార్యాలయంలో ఉన్నతాధికా రులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించా రు. సింగరేణి లాభాల్లో ఉండి సంస్థ ఉద్యోగులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలన్నది ప్రభు త్వ ప్రధాన ఆలోచన అని అన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా బొగ్గు రంగంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో మార్కెట్లో పోటీకి తట్టుకుని సింగరేణి నిలబడాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం, బహిరంగ మార్కెట్లో సింగరేణి బొగ్గుకు ఉన్న ధరను ఎప్పట ికప్పుడు అధికారులు, సిబ్బంది పోల్చుకోవాలని సూచించారు. ఈ ఉత్పత్తి వ్యయం, మార్కెట్లో బొగ్గు ధరలకు సంబంధించిన వివరాలను సంస్థ కార్మికులకు అవగాహన కలిగేలా మైన్స్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైనింగ్ రంగంలో 136 సంవత్సరాల అనుభవం ఉన్న సింగరేణి కంపెనీ బొగ్గుతో పాటు ఇతర మైనింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టి లాభాలు ఆర్జించే ఆలోచన చేయాలని మంత్రి భట్టి సూచించారు. సింగరేణి మైన్ కార్యకలాపాలు జరిగే ప్రాంతం మొత్తం వరకు అక్కడి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశిం చారు. భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు గ్రామాలు ప్రభావితం అవుతున్నాయని స్థానికులు తెలిపారు, ఈ అంశంపై విచారణ చేయాలని, సింగరేణి మైన్స్ కోసం భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన జాబితాపై విచారించాలని, అర్హుల జాబితా పంపాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యం ఇటీవల కల్పించామన్నారు. సింగరేణ ిలోని శాశ్వత ఉద్యోగులకే కాదు కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లిస్తున్న విషయాన్ని సమావేశంలో చర్చించారు. సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, సింగరేణి సిఎండి బలరాం నాయక్, జికలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సింగరేణి ఓపెన్ కాస్ట్ బి 2ని ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కావ్య, కలెక్టర్ రాహుల్ శర్మ, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, డైరెక్టర్ గౌతమ్ పొత్రో తదితరులు సందర్శించారు.



