– రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటి డిమాండ్
హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 24ః రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని పెన్షనర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఈ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు నిరాహార దీక్షలు పిలుపుమేరకు హన్మకొండ ఏకశిలా(జయశంకర్) పార్కు దగ్గర నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వి.రాంమనోహర్, కందుకూరి దేవదాసు, కడారి బోగేశ్వర్, టి.పురుషోత్తం, కె.సుధీర్ బాబులు మాట్లాడుతూ మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను 20 నెలలు గడిచినా చెల్లించకపోవడం దారుణమని, ఇది పెన్షనర్లను మానసికంగా వేధించడమేనని, తీవ్ర అనారోగ్యానికి గురి చేయడం ప్రభుత్వానికి సరియైనది కాదని అన్నారు.పెండింగ్ బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 35 మంది పెన్షనర్లు బకాయిల గోసతో చనిపోయారన్నారు. దాదాపు 14వేల మందికి 20 నెలల నుండి బకాయిలు చెల్లించలేని కారణంగా విసిగివేసారి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలను కాపాడాలని, వెంటనే పెండింగ్ బకాయిలు అన్నింటిని ఏకమొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్‌జీపీఏటీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.వీరయ్య, జి.సాంబయ్య, కె.సమ్మారెడ్డి మాట్లాడుతూ తక్షణం కనీసం పిఆర్సీ 2020 ఎరియర్స్, జిపిఎఫ్ బిల్లులు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యూటీ, కమ్యుటేషన్, సర్వీసులో చేసుకున్న సరెండర్ లీవులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలో ఎండీ మహబూబుఅలీ, ఇ.ఇంద్ర సేనారెడ్డి, విశ్వనాథం, వేల్పుల రవీందర్, రఘువీర్, పి.రాజిరెడ్డి, పి.సమ్మయ్య, ఎండీ మదార్ సాహెబ్ M.రా జకొమురమ్మ,పి.వి కృష్ణారావు పాల్గొన్నారు. బీజేపీ వరగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కోల సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, టి.పి.టి.ఎఫ్. జిల్లా అధ్యక్షుడు యు. అశోక్, డి.టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎ.గోవింద రావులు శిబిరానికి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కార్యక్రమంలో బకాయిల సాధన కమిటీ ట్రెజరర్ సూర కుమారస్వామి, జాయింట్ సెక్రెటరీలు ఎండి. అబ్దుల్ గఫార్, ఎం.దామోదర్, ఈ. ఇంద్రసేనారెడ్డి,ఎల్.ప్రభాకర్ రెడ్డి, అశోక్ కుమార్,పి.రాజి రెడ్డి, సారయ్య, రాజేందర్, కే.శ్యామ్ రావు, జే. మహేందర్ రావు, ఎం.సంజీవరెడ్డి,మామిండ్ల మురళీ తదితరులు 180 మంది ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




