హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: మొయినాబాద్ చిలుకూరు బాలాజీ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు నిర్వహించి.. వేద మంత్రోచ్చారణతో దేవాలయాన్ని శుద్ది చేశారు. అనంతరం పుట్ట బంగారం (పుట్టమన్ను) తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేశారు. అందులో నవధాన్యాలు, పాలికలు కలిపి హోమాలను వెలిగించారు. అనంతరం విశ్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలను చేపట్టారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయం ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. పూజా కార్యక్రమాలు తిరుమల కిరణాచారి. రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, కన్నయ్య, కిట్టు, మురళి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





