బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుల పనులు వెంటనే మొదలుపెట్టాలి 

 

పక్కనబెడితే ఊరుకోం.. లేకుంటే  రైతుల పక్షాన పాదయాత్ర చేపడుతాం.

– మాజీ మంత్రి హరీష్ రావు

నారాయణఖేడ్ కి బీఆర్ఎస్ హయాంలో రోజూ మంచినీళ్లు వోచ్చేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ..”100 కోట్ల రూపాయలను నారాయణఖేడ్ తండాలకు కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డబ్బును రేవంత్ రెడ్డి ఇవ్వడంలేదు…8 చెరువులు సాంక్షన్ చేసి భూమి ఇచ్చాము…కాళేశ్వరం నీళ్లను బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఇవ్వాలని కేసీఆర్ బసవేశ్వర ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు…బసవేశ్వర ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలి…బసవేశ్వర ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం…సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల కోసం బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది అవసరమైతే పాదయాత్ర కూడా చేస్తాం…సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు. ఎందుకు సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయడం లేదో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  సమాధానం చెప్పాలి.. అని డిమాండ్ చేసారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..యాసంగిలో సగం మంది రైతులకు రైతుబంధు కోత.. సాగు చేసిన భూమికే అనే సాకుతో 70 లక్షల ఎకరాలకు ఎసరు పెట్టారనీ పత్తి, చెరుకు, తోటల రైతులకు ఇక ఏడాదికి ఒకసారి మాత్రమే రైతుబంధు.. రేవంత్ రెడ్డి కుట్రను తిప్పికొట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు సూచించారు. సోయా, మొక్కజొన్నలు కొనుగోలు చేసి 48 రోజులు దాటినా చిల్లిగవ్వ ఇవ్వలేదని పేర్కొంటూ వోట్ల  కోసమే చీరల పంపిణీ.. అవి చీరల్లా లేవు యూనిఫామ్ లా ఉన్నాయి. మహిళలకు రెండేళ్ల బకాయి రూ. 60 వేలు చెల్లించాకే సారె పెట్టాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించకపోతే రైతుబంధు పథకం పూర్తిగా బంద్ కావడం ఖాయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
” కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నది..ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గం వెళ్తే రెండు లారీల సోయాబిన్ కొంటే అందులో 60 క్వింటాళ్లను వాపస్ పంపించారు.. నారాయణఖేడ్ లో  అయినా రాష్ట్రంలో అయినా మక్కలు, సోయాబిన్ పంట కొని నెల రోజులు అయిపోయింది. మక్క, సోయాబిన్ కు ఇప్పటిదాకా ప్రభుత్వం ఒక రూపాయి విడుదల చేయలేదు..పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు..48 రోజులు అయిపోయినా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు..ముల్లకర్ర పట్టి పొడిచినా ఈ ప్రభుత్వానికి చలనం లేదు..రాష్ట్రంలో సోయాబీన్ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. కొనుగోలు చేయడం లేదు. కొన్న పంటను కూడా వాపస్ పంపిస్తున్నారు..వెంటనే మక్క, సోయాబిన్ పంట కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నాం..రెండుసార్లు రైతుబంధు ఇచ్చి రెండుసార్లు ఎగ కొట్టారు..పోయిన యాసంగి బోనస్ ఇంకా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..వెంటనే 1150 కోట్లను యాసంగి బోనస్ కింద సన్న వడ్లకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా..సాగు చేసిన భూమికే రైతుబంధు ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పిండు వ్యవసాయ మంత్రి..మూడు పంటలకు రైతుబంధు ఇయ్యాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సాగుచేసిన భూమికే రైతు బంధు ఇస్తా అంటున్నాడు..55 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండుతుంది. 8 నెలలకు ఒకసారి పంట వస్తుంది. అంటే పత్తి రైతుకు సంవత్సరానికి ఒకసారి రైతుబంధు ఇస్తావా..చెరుకు అనేది 11 నెలల పంట. చెరుకుకి ఒక్కసారే రైతుబంధు ఇస్తా అని ప్రభుత్వం అంటున్నది..పంట తోటలకు ఒక పంటకే ఇస్తావా? 7 లక్షల ఎకరాల్లో కందుల సాగు జరుగుతుంది..పసుపు, పత్తి, ఆయిల్ పామ్, పండ్ల తోటలకు ఒక సారి మాత్రమే రైతుబంధు ఇస్తానని ప్రభుత్వం చెబుతున్నది..రైతుబంధు ఎగ్గొట్టే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు..ఇప్పటికే బోనస్ ఎగ్గొట్టిండు. పంటల బీమా ఎగగొట్టిండు..ఈ యాసంగిలో సాగు చేసిన వారికే రైతు బంధు అని ప్రభుత్వం చెపుతుంది..సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ ని ఓడగొడితేనే రెండు పంటలకు రైతుబంధు వస్తుంది..11 సార్లు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ ..కొరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం..70 లక్షల ఎకరాలకు రైతుబంధు ఒకటే సారి ఇస్తామని ప్రభుత్వం అంటున్నది..కేవలం వరికి మాత్రమే రైతుబంధు ఇస్తారా?..యాసంగిలో కోటి 46 లక్షల మందికి ఇస్తావా? లేదా సగం మందికి ఎగ్గొడతావా?..రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక విధానం లేదా?..కేసీఆర్ దేశంలో మొట్టమొదటిసారి రైతుబంధు పథకాన్ని తెచ్చాడు…రైతులందరికీ రైతుబంధు సంవత్సరానికి రెండుసార్లు ఇచ్చాడు..కాంగ్రెస్ పార్టీని సర్పంచ్ ఎన్నికల్లో ఓడ కొట్టాలి లేకపోతే రైతుబంధు పోతుంది..దేశంలో పత్తి దిగుబడి చాలా తగ్గిపోయింది పత్తి రైతులను ఆదుకోవాలి…యాసంగికి పత్తి రైతులకు రైతుబంధు ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు..చేతల ప్రభుత్వం బీఆర్ఎస్ చెత్త ప్రభుత్వం కాంగ్రెస్..బీఆర్ఎస్ అందరికి భరోసా ఇచ్చింది. కాంగ్రెస్ అవినీతికి భరోసా ఇచ్చింది…రేవంత్ రెడ్డి చీరలు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే ఇస్తున్నాడు….కేవలం వోట్లు ఉన్నాయని ఊర్లలో చీరలు పంచుతున్నారు..నారాయణఖేడ్ మున్సిపాలిటీలో వోట్లు లేవని చీరలు పంచడం లేదు..కేసీఆర్ పండుగకు చీరలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు చీరలు ఇస్తున్నాడు..మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగ ఉన్నాయి.. కేసీఆర్ రంగుల చీరలు ఇచ్చాడు..కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు కేసీఆర్ ఇచ్చాడు..ఈ ప్రభుత్వం ఇస్తుంది 50 లక్షల చీరలే..మహిళలకు నెలలకు 2500 ఇస్తానని చెప్పావు అది ఇస్తే మహిళలకు సారె పెట్టినట్టు..రెండేళ్లకు 60 వేల రూపాయలు ప్రతి మహిళకు బాకీపడ్డ రేవంత్ రెడ్డి ముందు అది చెల్లించి సారె పెట్టిన అని చెప్పు..అని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *