- 31 నుండి జనవరి 20 వరకు కొనసాగింపు
- 9న గోదావరి నదిలో తెప్పోత్సవం,10న తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనం
భద్రాచలం,ప్రజాతంత్ర,డిసెంబర్ 30 : ప్రముఖపుణ్యక్షేత్రమైన భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవోపే తంగా శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి.. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధి నామసంవత్సర పుష్య శుద్ధ పాడ్యమి డిసెంబర్ 31 నుండి జనవరి 20వ తేది వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం వైధిక కమిటి నిర్ణయించింది. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
మంగళవారం నాడు ‘‘మత్స్యవతారం’’ జనవరి 1వ తేది బుధవారం ‘‘కూర్మావతారం’’, 2వతేదిగురువారం ‘‘వరాహవతారం’’, 3వతేదిశుక్రవారం ‘‘నరసింహవతారం’’, 4వతేది శనివారం ‘‘వామనావతారం’’, 5వ తేది ఆదివారం ‘‘పరశురామావతారం’’, 6వ తేది సోమవారం ‘‘శ్రీ రామవతారం’’, 7వ తేది మంగళవారం ‘‘బలరామావతారం’’, 8వ తేది బుధవారం ‘‘శ్రీకృష్ణవతారం’’, 9వ తేది గురువారం గోదావరి నదిలో ‘‘తెప్పోత్సవం’’, 10వ తేది తెల్లవారుజామున ‘‘ఉత్తరద్వారదర్శనం’’ నిర్వహించనున్నారు. 11వ తేది నుండి వివిధ ప్రాంతాల్లో రాపత్తు ఉత్సవాలు నిర్వహించనున్నారు.ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు భారీగా చేసారు.
తెప్పోత్సవంకోసం గోదావరి నదీతీరంలో విహరించేందుకు హసవాహనాన్ని సిద్దం చేస్తున్నారు.అలాగే ఆలయం రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు.భక్తులు మెచ్చేవిధంగా జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేయించారు.ఈసారి ప్రత్యేక ఆకర్శనగా గోదావరి ప్రాంతంతలో గిరిజన సాంప్రదాయాలతో కూడిన మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు.భక్తులకు కనువిందు చేయనుంది.అలాగే ప్రధాన రహదారులలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసారు.గోదావరి నదీతీరమంతా విద్యుత్ దీపాలు అలంకరించారు.ప్రదాన ఆలయంతో పాటుగా అనుబంద ఆలయాలు కూడా ముస్తాబు చేసారు.





