•సిఎస్‌ఆర్ పద్ధతిలో చెరువుల అభివృద్ధి
•కెబిఆర్ పార్క్ ఎంట్రీ 1 వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్…
•14 అంశాలకు జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ ఆమోదం
•పాల్గొన్న మేయరర్, కమిషనర్, అధికారులు, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : సిఎస్‌ఆర్ పద్ధతిలో చెరువుల అభివృద్ధికి, చెరువులలో దోమల నివారణకు డ్రోన్‌ల ద్వారా స్ప్రే చేసేందుకు ముందుకు వొచ్చే వారిని గుర్తించాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. గురు వారం మేయర్ అధ్యక్షతన 5వ స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగింది. కమిటీ సమావేశంలో 14 అంశాలకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ ఆమ్రపాలి కాట, అధికారులు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాలలో… కేబీఆర్ పార్కు ఎంట్రీ వన్ గేట్ వద్ద మల్టీలెవల్ స్మార్ట్ కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్ అభివృద్ధి, నిర్వహణ కోసం 10 సంవత్సరాలకు హైఎస్ట్ బిడ్డర్ అయిన నవనిర్మాణ్ అసోసియేషన్ సంస్థకు లెటర్ ఆఫ్ అవార్డు ఇవ్వడానికి సంబంధించి రాటిఫికేషన్ కొరకు కమిషనర్ జిహెచ్‌ఎంసికి రికమండ్ చేస్తూ కమిటీ ఆమోదం…జిహెచ్‌ఎంసిలో పనిచేస్తున్న 90 మంది కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు/ కమ్యూనిటీ ఆర్గనైజర్ల పే స్కేల్‌ను ప్రభుత్వ ఉత్తర్వు 827 ఎంఏ • యుడి(యుబిఎస్) 2023, అక్టోబర్ 8 ప్రకారంగా మేరకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ రూ.24,280- 72,850కు పెంచుతూ 2023, ఏప్రిల్ 1 నుండి వర్తింపు ప్రతిపాదనలకు ఆమోదం.. బండ్లగూడ జంక్షన్ నుండి ఎర్రకుంట జంక్షన్ వరకు 100 అడుగుల రహదారి విస్తరణ అభివృద్ధికి ఎస్‌ఆర్‌డిపి క్రింద 20 కోట్ల వ్యయంతో చేపట్టే రోడ్డుకి 44 ఆస్తుల సేకరణ కొరకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ మంజూరు, రాటిఫికేషన్ సిఫారసుకు ఆమోదం…
షేక్ పేట్ మండలం వార్డు నం.10 బంజారాహిల్స్ రోడ్ నెం 14లో యాక్సెస్ రోడ్డు కేటాయింపుకు హైకోర్టు ఆదేశాల మేరకు టి.సురేఖ, ఎ.విజయలక్ష్మి లకు చెందిన ప్లాట్లకు 70.04 చదరపు గజాల స్థలానికి మార్కెట్ విలువ చదరపు గజానికి ఒక లక్ష రూపాయల చొప్పున చెల్లింపుపై ఎన్‌ఓసి జారీ చేయ డానికి ఆమోదం…శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట్ లోని కైదమ్మ కుంటను సిఎస్‌ఆర్ కింద పునరుద్దరించుటకు మల్లిగావద్ ఫౌండేషన్ వారితో ఆరు నెలల కాలానికి జిహెచ్‌ఎంసి కమిషనర్ ఎంఓయు చేయుటకు ఆమోదం…సికింద్రాబాద్-సీతా
శేరిలింగంపల్లి జోన్‌లో సిఎస్‌ఆర్ కింద వివిధ పార్కులలో ప్రతిపాదిత ఐదు లొకేషన్లలో ఇంజక్షన్ బోర్ వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టుటకు వాటర్ ఏయిడ్ ఆర్గనైజేషన్‌తో జోనల్ కమిషనర్ ఎంఓయు చేసుకొనుటకు ఆమోదం…బంజారాహిల్స్, ఎన్‌బిటీ నగర్‌లో ఏసిబి కార్యాలయం వెనుక వైపు రూ.3.85 కోట్ల అంచనా వ్యయంతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టుటకు పరిపాలన అనుమతికి ఆమోదం… శేరిలింగంపల్లి మండలం, గోపన్ పల్లి గ్రామంలో 500 గజాల స్థలంలో పెంపుడు జంతువుల స్మశాన వాటిక నిర్మాణం, మూడు సంవత్సరాల పాటు నిర్వహణను తమ సొంత నిధులతో చేపట్టుటకు రాగ ఫౌండేషన్ వారితో జోనల్ కమిషనర్ ఒప్పందం చేసుకొనుటకు ఆమోదం… జూన్, 2024 నుండి జులై 2024 వరకు జిహెచ్‌ఎంసికి సంబంధించిన ఆదాయ, వ్యయాలకు ఆమోదం…
వివిధ వార్డస్‌లో 15,500 కొత్త ఎల్‌ఇడి స్ట్రీట్ లైట్లు కొనుగోలు చేయుటకు రూ. 2,98,72,000 లకు పరిపాలన అనుమతి, షార్ట్ టెండర్లను పిలవడానికి కమి టీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు బన్నాల గీత ప్రవీణ్ ముది రాజ్, ఫాహెద్ బిన్ అబ్దుల్ సమద్, మహ మ్మద్ ఖాదీర్, పొడవు అర్చన, మహమ్మద్ నజీర్ ఉద్దీన్, రఫత్ సుల్తానా, గౌస్ ఉద్దీన్ మహమ్మద్, మన్నె కవితా రెడ్డి, మహ మ్మద్ రషీద్ ఫరా జుద్దీన్, ఉప్పల పాటి శ్రీకాంత్, సబీహా బేగం, ఆవుల రవీందర్ రెడ్డి, చింతల విజయ్ శాంతి, కంది శైలజ, సెక్రటరీ సత్యనా రాయణ, అడిషనల్ కమిషనర్లు నళిని పద్మావతి, చంద్రకాంత్ రెడ్డి, యాదగిరి రావు, పంకజ, మంగతాయారు, సిసిపి శ్రీనివాస్, చీఫ్ ఎంటమాలజీ డా.రాంబాబు, చీఫ్ వెటర్నరి డాక్టర్ అబ్దుల్ వకీల్, అకౌంట్స్ ఎగ్జామినర్ వేంకటేశ్వర రెడ్డి, జోనల్ కమిషనర్లు అపూర్వ్ చౌహన్, హేమంత్ కేశవ్ పాటిల్, రవి కిరణ్, ఉపేందర్ రెడ్డి, వెంకన్న, ప్రాజెక్టు సి ఈ దేవానంద్, హౌసింగ్ సిఈ అనిల్ రాజ్, ఖైరతాబాద్ జోన్ ఎస్‌ఈ రత్నాకర్, ఇంజనీరింగ్ తదితర అధిరారులు పాల్గొన్నారు.





