గెలుపు ఓటములు సహజం.. క్రీడా స్ఫూర్తి ముఖ్యం

– క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
– ఓటమిలో పాఠాలు నేర్చు కోవాలి
– మంత్రి సీతక్క

పినపాక, ప్రజాతంత్ర, జనవరి 7 : గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్రీడాకారుల‌కు ఉద్బోధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ‌పాఠశాల ఆవరణలో 69వ జాతీయస్థాయి అండర్‌ -17 ‌బాలుర కబడ్డీ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్‌ ‌గేమ్స్ ‌ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కంది చారిటబుల్‌ ‌ట్రస్ట్, ‌మౌర్య టెక్‌  ‌సౌజన్యంతో ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ద‌నసరి అనసూయ (సీతక్క), పినపాక , భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి.పాటిల్‌, ‌జిల్లా ఎస్పీ రోహిత్‌ ‌రాజు, భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్‌ ‌తదితరులు ప్రారంభించారు. మణుగూరు ప్రధాన కూడలి నుంచి సీఎం టార్చ్ ‌ర్యాలీని మంత్రి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్‌ ‌ఆవరణలో మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం గాలిలోకి బెలూన్లను వదిలి పోటీలను ప్రారంభించారు.

ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చినట్లు ఉంది

మంత్రి శ్రీహరి దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ ఈస్ట్ ఆర్‌ ‌వెస్ట్ – ఇం‌డియా ఈస్ ‌ద‌ బెస్ట్, ఈస్ట్ ఆర్‌ ‌వెస్ట్ – ‌బయ్యారం ఈస్ ‌ద‌ బెస్ట్, ‌భారత్‌ ‌మాతాకీ జై అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ క్రీడా సంబ‌రం చూస్తే సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్లుగా ఉందన్నారు. కబడ్డీ అనేది మన దేశంలోనే పుట్టిన సంప్రదాయ క్రీడ అని, మన మట్టిలో పుట్టిన ఈ ఆటలు మన సంస్కతి, సువాసనను ప్రపంచానికి చాటుతాయని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా మారుమూల గిరిజన ప్రాంతమైన ఏడూళ్ళ బయ్యారంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించ‌డం గర్వకారణమన్నారు. ఈ పోటీల ద్వారా బయ్యారం గ్రామం పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని తెలిపారు. వాజ్‌పేయి ప్రధానమంత్రిగా వున్న కాలంలో భారత్‌-పాకిస్తాన్‌ ‌క్రికెట్‌ ‌మ్యాచ్‌ ‌సందర్భంగా గెలుపు ఓటములకన్నా మనసులు గెలుచుకొని రావాలి అన్న సందేశాన్ని గుర్తు చేస్తూ బయ్యారానికి వచ్చిన క్రీడాకారులు కూడా ఇక్కడి ప్రజల మనసులు గెలుచుకొని వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

ఓటమి పాఠాలను జీవితానికి అన్వ‌యించుకోవాలి

జాతీయస్థాయి పోటీలను బయ్యారంలో నిర్వహించేందుకు బాధ్యత తీసుకున్న కంది చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీల నిర్వహణ కోసం వారు సుమారు ఆరు నెలలపాటు శ్రమించి ఏర్పాట్ల నుంచి ఆతిథ్యం వరకు సమర్థవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి, అనుభవాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. చిన్నపాటి తప్పిదాలతో ఓడిపోయినప్పుడు నిరాశ చెందకుండా, గెలుపు ఇచ్చే ఆనందాన్ని, ఓటమి పాఠాలను జీవితానికి అన్వ‌యించుకోవాలన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతమైన బయ్యారంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించటం ఎంతో సంతోషకరమన్నారు. గ్రామీణ స్థాయిలో యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ తరహా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతంగా నిర్వహించామని, జాతీయస్థాయి పోటీలను కూడా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి. పాటిల్‌ ‌మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చి జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఇది మరచిపోలేని అనుభవంగా నిలుస్తుందన్నారు. ఈ పోటీల ద్వారా జిల్లా ఖ్యాతి దేశవ్యాప్తంగా మరింతగా పెరుగుతుందని, క్రీడల నిర్వహణలో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, క్రీడా శాఖ అధికారి పరంధామరెడ్డి, టోర్నమెంట్‌ అబ్జర్వర్‌ ‌నిర్మల్‌ ‌జంగ్డే, సర్పంచ్‌ ‌చందర్రావు, కంది చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌సుబ్బారెడ్డి, విశ్వ భరత్‌ ‌రెడ్డి, త‌హ‌సిల్దార్‌ ‌గోపాలకృష్ణ, ఎంపీడీవో సంకీర్త్, ఎం‌పీఓ వెంకటేశ్వరరావు, క్రీడా శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *