– అధికారులతో మంత్రులు సీతక్క, సురేఖ టెలికాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రభుత్వం వేగం పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అధికారికంగా ప్రణాళికను ఖరారు చేయగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో సచివాలయం నుంచి మంత్రి సీతక్క, వరంగల్ నుంచి మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మేడారం అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రి ఖరారు చేయడంతో కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.. ఇది ఒక మహాఘట్టం.. ఈ చరిత్రాత్మక పనిలో మీరు అందరూ భాగమవుతున్నారు.. ఈ కృషి శాశ్వతంగా నిలుస్తుంది అని మంత్రులు పేర్కొన్నారు. మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. భక్తులకు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే అభివృద్ది ప్రణాళికలకు సంబంధించి వర్కింగ్ డ్రాయింగ్స్, స్ట్రక్చరల్ డిజైన్స్‌ను అత్యంత వేగంగా పూర్తి చేయాలని, తదనుగుణంగా పనుల అంచనాలను సిద్ధం చేసి టెండర్లు తక్షణమే పిలవాలని మంత్రులు ఆదేశించారు. కాన్ఫరెన్స్‌కు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్, పంచాయతీరాజ్ ఈఎన్సీ ఎన్.ఆశోక్, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





