– స్వామివారికి అష్టోత్తర శతకటాభిషేకం
– గిరి ప్రదక్షిణలో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అష్టోత్తర శతకటాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావులు పాల్గొన్నారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజు స్వామివారి కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుంటే సకల కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారి ఆలయంలో నిత్య ఆరాధనలు, నిత్య కల్యాణాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా, కార్తీక మాసం సందర్భంగా స్వామివారి ఆలయంలోని సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో భక్తులు అధిక సంఖ్యలో వ్రతాలు చేయించుకున్నారు. ఇందుకనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



