తిరుమల దర్శనం దివ్యంగా కల్పించాలి

కలియుగ వైకుంఠమైన తిరుమలకు ఆపదమొక్కులవాన్ని దర్శనానికి ప్రతి హిందువు అత్యంత భక్తిశ్రద్ధలతో వెళ్తుంటారు తమ కష్టాలను కడ తీరుస్తాడని అపారమైన నమ్మకం! అలిపిరిలో భద్రతా కారణాలతో ప్రతి భక్తున్ని మరియు వారి వెంట ఉన్న సంచులను సామాగ్రిని నిశితంగా పరిశీలిస్తారు. ఇది అత్యంత అవసరం కానీ వయోధికులు స్త్రీలు పిల్లలు తమ తమ సంచులను ఇతర సామాగ్రిని వాహనాల నుండి దించి పరిశీలన తర్వాత మరల వాహనంలో పెట్టుటకు అత్యంత ప్రయాసలకు లోను కావలసి వస్తుంది.

తిరుమలలో కేంద్ర రిసెప్షన్ కార్యాలయంలో గదులు పొందిన తర్వాత వాటి వద్దకు పోవుటకు అత్యంత వ్యయం వెచ్చించవలసి వస్తుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం చేరుకొనుటకు కూడా వ్యయంతో కూడుకొని ఉంటున్నది. గోవిందుని దర్శనమునకు కష్టములను ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపార్ట్మెంటులలో గంటల తరబడి నిరీక్షణ కొన్ని కంపార్ట్మెంట్లలో కుర్చీలు లభ్యం లేక వయోదికులు స్త్రీలు పిల్లలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇక్కడ అల్పాహారము పాలు నిర్దిష్టంగా కాకుండా నిరంతరముగా సరఫరా చేయాలి. ఈ కంపార్ట్మెంట్ ప్రాంతాలలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ ఇంకా పరిశుభ్రంగా అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది. దేవ దేవుని దర్శనానికి భక్తులను క్రమబద్ధంగా నిర్వహిస్తున్న విధానాన్ని దర్శనం తర్వాత బయటకు వెళ్లేంతవరకు కూడా అదే విధముగా కొనసాగించాలి. విమాన వెంకటేశ్వరుని దర్శనం చాలా కష్టంగా ఉంటున్నది . ప్రధాన హుండీలో కానుకలు సమర్పించుటకు భక్తులకు అతిగా కష్టం కలుగుతున్నది. ఈ ప్రాంతంలో ఊపిరి కూడా సల్పడం లేదంటే అతియో శక్తి కాదు! భక్తులు దేవాలయం లోపల ఇతర హుండీలో కానుకలు సమర్పించుటకు తెలుగుతోపాటు ఇతర భాషలలో కూడా బోర్డులతో పాటు మైకులలో విస్తృత స్థాయిలో ప్రకటనలు భక్తులలో విశ్వాసం కలిగే విధంగా చేయాలి. క్రమశిక్షణతో క్రమ పద్ధతిలో హుండీలో కానుకలు సమర్పించుటకు సమర్థవంతంగా నిర్వహించాలి . ఇక్కడ గుంపులు గుంపులుగా వెళ్లనీయకుండా తగిన ఏర్పాట్లు చేయాలి

 

అలిపిరి వద్ద భద్రతా పరిశీలనకు ఆధునిక భద్రతా రక్షణ పరికరాలు ఉపయోగించాలి మరియు సేవకులను కూడా వినియోగించాలి కేంద్ర రిసెప్షన్ కార్యాలయం నుండి భక్తులకు కేటాయించిన గదుల సముదాయాలకు అన్న ప్రసాద కేంద్రాలకు వెళ్ళుటకు దేవస్థానం నామమాత్రపు రుసుముతో వాహనాలు ఏర్పాటు చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర రిసెప్షన్ కార్యాలయం నుండి గదుల సముదాయాలు ఆది దేవుని దర్శనము బస్ స్టేషన్ ప్రాంతాలకు సబ్సిడీలతో కూడిన వాహనాలను విస్తృత స్థాయిలో ప్రతిభక్తుడు కూర్చునే విధముగా తగు ఏర్పాట్లు కల్పించాలి. విశ్వ వ్యాప్తంగా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను కల్యాణ మండపాలు ఇతర భవనాలకు నిధులు సమకూర్చున్న తిరుమలేశునికి తన దర్శనానికి వచ్చే భక్తులకు సంతృప్తికరమైన సకల సౌకర్యాలు కల్పించుటకు ఎలాంటి అవరోధాలు సృష్టించడు. శ్రీ వెంకటేశ్వర దర్శనం భక్తుని మదిలో నభూతో నభవిష్యతి నిలిచిపోయే రీతిలో ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తగు సూచనలు చేస్తాడని పవిత్రమైన హృదయంతో ప్రార్థిస్తున్నాను

దండంరాజు రాంచందర్ రావు 

పాత బోయినపల్లి సికింద్రబాద్ 

9849592958

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *