చార్మినార్ గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం హైదరాబాద్ చరిత్రలో ఒక ప్రధానమైన విషాదం. ఒకే ఇంట్లో పదిహేడు మంది హఠాత్తుగా మృత్యువాత పడ్డారు. హృదయమూ, మేధా ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసిన ఈ దుర్ఘటన గురించి చాలా లోతుగా ఆలోచించవలసి ఉంది. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత ఏయే గుణపాఠాలు తీసుకున్నామో, ఏ పరిష్కార చర్యలు చేపట్టామో, అవి ఎంత అమలయ్యాయో సమీక్షించవలసి ఉంది. ప్రస్తుత సందర్భంలో ఏ పొరపాట్లు జరిగాయో మదింపు వేయవలసి ఉంది. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టడం ఎట్లా అని ఆలోచించవలసి ఉంది.
ఎవరి మరణమైనా విచారకరమే. అందులోనూ అది అనూహ్య, అకాల, ఆకస్మిక, అసహజ, ప్రమాద మరణమైతే మరింత విచారకరం. అటువంటి మరణాలు అనివార్యమైనవేమీ కావు. వ్యవస్థ సక్రమంగా ఉంటే అటువంటి మరణాలలో అత్యధికభాగం నివారించడానికి, విలువైన ప్రాణాలు కోల్పోకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. వ్యవస్థలో అనేక నిర్ణయాత్మక అంతర్భాగాలు వాటి పని అవి సక్రమంగా చేయకపోవడం వల్ల సంభవించే మరణాలు ఇవి. అందువల్ల మనుషుల ఆలోచనలను అటువైపు తిప్పి, భవిష్యత్తులో అటువంటి మరణాలు సంభవించే అవకాశం లేని స్థితిని కల్పించాలి. కాని మన సమాజంలో ప్రాణహాని వంటి తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు పత్రికలలో, ఛానళ్లలో పెద్ద ఎత్తున గగ్గోలు రేగడం, ఒకటి రెండు రోజుల్లోనే అది మణగిపోవడం జరుగుతుంది.
ఆ ఒకటి రెండు రోజుల గగ్గోలులో కూడా మౌలిక విషయాలు చర్చకు రాకుండా అందరూ జాగ్రత్త పడతారు. పైపై విషయాలు తూతూ మంత్రంగా చర్చిస్తారు. అప్పటికి ఆ ఘటన మీద చర్చ జరిపామని చర్చించినవారికి సంతృప్తి, ఏదో చర్చ జరిగిందని చదివినవారికి, విన్నవారికి సంతృప్తి కలుగుతుంది. కాని మౌలిక విషయాలు ప్రస్తావనకే రాలేదు గనుక, వాటి పరిష్కారాల ఊసు కూడా ఉండదు. మళ్లీ అటువంటి మరొక ఘటన జరిగేవరకూ మౌనం, నిశ్శబ్దం కొనసాగుతాయి. అప్పుడు కూడా ఆ ఘటన మీద ఒకటి రెండు రోజుల చర్చ. మళ్లీ మౌనం. ఇలా ఘటన నుంచి ఘటనకు చర్చాకారులు గంతులు వేస్తుంటారు. ఎక్కడా ఎవరూ లోతైన, మౌలికమైన విషయాలు చర్చకే తేరు. సమస్య మూలాలు చర్చించి, పరిష్కారాలు ఆలోచించి, దీర్ఘకాలికంగా సమస్య మళ్లీ తలెత్తకుండా చూడాలనే ఆలోచనే ఉండదు.
అలాగే అగ్ని ప్రమాదాల వంటి దుర్ఘటనలు జరిగినప్పుడు తక్షణ సహాయ, ఉపశమన, పునరావాస చర్యలు తీసుకోవలసిన వ్యవస్థలు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో, తక్షణ సహాయం అందకపోవడం వల్ల అదనంగా ఎన్ని మరణాలు, ఎన్ని ప్రమాదాలు, ఎంత నష్టం జరుగుతున్నదో చర్చకు వస్తుంది గాని ఆ తక్షణ సహాయ వ్యవస్థలను బలోపేతం చేయవలసి ఉంటుందనే, ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంచవలసి ఉంటుందనే ఆలోచననే అందరికందరూ మరిచిపోతారు. మరొక దుర్ఘటన జరిగేదాకా ఇదే పరిస్థితి.
ఎవరి మరణమైనా విచారకరమే. అందులోనూ అది అనూహ్య, అకాల, ఆకస్మిక, అసహజ, ప్రమాద మరణమైతే మరింత విచారకరం. అటువంటి మరణాలు అనివార్యమైనవేమీ కావు. వ్యవస్థ సక్రమంగా ఉంటే అటువంటి మరణాలలో అత్యధికభాగం నివారించడానికి, విలువైన ప్రాణాలు కోల్పోకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. వ్యవస్థలో అనేక నిర్ణయాత్మక అంతర్భాగాలు వాటి పని అవి సక్రమంగా చేయకపోవడం వల్ల సంభవించే మరణాలు ఇవి. అందువల్ల మనుషుల ఆలోచనలను అటువైపు తిప్పి, భవిష్యత్తులో అటువంటి మరణాలు సంభవించే అవకాశం లేని స్థితిని కల్పించాలి. కాని మన సమాజంలో ప్రాణహాని వంటి తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు పత్రికలలో, ఛానళ్లలో పెద్ద ఎత్తున గగ్గోలు రేగడం, ఒకటి రెండు రోజుల్లోనే అది మణగిపోవడం జరుగుతుంది.
భవన నిర్మాణంలో అవకతవకలు, ఇరుకు సందులు, ఇరుకు ఇళ్లు, అగ్నిమాపక చర్యలకు అవకాశం లేకపోవడం, విద్యుచ్చక్తి అక్రమ వినియోగం, ఓవర్ లోడ్, ఇళ్లలో వైరింగ్ లోపాలు, విద్యుత్ సరఫరా లోపాలు, ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించగానే తగిన సమయంలో అగ్నిమాపక దళం అక్కడికి చేరుకోలేకపోవడం, ఒకవేళ చేరుకున్నా మంటలను ఆపడానికి తగిన నీటి సదుపాయం లేకపోవడం, అగ్నిమాపక వాహనాలు ప్రవేశించలేని సందులు, అధికారుల నిర్లక్ష్యం, హాస్పిటల్స్ లలో సిబ్బంది కొరత, సమయానికి ఆంబులెన్సులు ఘటనా స్థలానికి చేరలేకపోవడం, బాధితులకు తక్షణ సహాయం అందించవలసిన అధికార వ్యవస్థల లేమి, నిర్లక్ష్యం, అవినీతి – ఇలా ఎన్నెన్నో కారణాలు ప్రతి ప్రమాదం వెనుకా, ప్రతి ప్రమాద మరణం వెనుకా ఉంటాయి.
ఈ సమస్యలన్నిటినీ ఆయా దుర్ఘటనలు జరిగినప్పుడు పత్రికా విలేఖరుల నుంచి అధికారుల దాకా, మంత్రుల నుంచి ప్రతిపక్షాల దాకా ప్రస్తావించడమైతే జరుగుతున్నది గాని, ఆ చర్చకు కొనసాగింపు ఉండడం లేదు. ఈ సమస్యలు పరిష్కరిస్తే, పరిష్కరించడానికి ప్రయత్నిస్తే, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు, అంటే అనవసరమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అరికట్టవచ్చునని ప్రతి ఒక్కరికీ తెలుసు. కాని ఆ పరిష్కారాల దిశగా చిన్నమెత్తు ప్రయత్నం కూడా జరగడం లేదు. నిజానికి ఈ సమస్యల పరిష్కారం అసాధ్యమైనదేమీ కాదు, ప్రభుత్వానికి, రాజకీయ నాయకత్వానికి, అధికారవర్గానికి ఆ పరిష్కారాల మీద శ్రద్ధ లేకపోవడం, నిరంతర జాగరూకతతో పరిష్కారాల గురించి ప్రశ్నించవలసిన పౌరసమాజం, ప్రచార మాధ్యమాలు తమ బాధ్యతను గుర్తించకపోవడం ఆ సమస్యల కొనసాగింపుకు కారణాలు.
భవన నిర్మాణం దగ్గర ప్రారంభిద్దాం. ఆయా భవనాలలో ఉండే మనుషుల గాలి, వెలుతురు అవసరాలు మాత్రమే కాదు, తాగునీటి సరఫరా, విద్యుత్తు సరఫరా, మురుగునీటిని బైటికి పంపించే సౌకర్యాలు, బహు అంతస్తుల నిర్మాణాలలో సులభంగా పైకీ కిందికీ తిరగడానికి సౌకర్యాలు, వాహనాలకు తగినంత స్థలం, గాలికీ, ఆహ్లాదానికీ అవసరమైన చెట్లు, పచ్చిక బయళ్లు వంటి ఎన్నో అవసరాలుంటాయి. ఆధునిక జీవితంలో పెరిగిపోతున్న ప్రమాదాల నేపథ్యంలో అవసరమైన సమయంలో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనుషులను ఇళ్ల నుంచి ఖాలీ చేయించడానికి, సురక్షిత స్థలాలకు పంపించడానికి కూడా ఇళ్ల మధ్య ఖాలీ స్థలాలు, జనావాసాల సాంద్రత మితి మీరకుండా చూడడం తప్పనిసరి అవసరాలు. అందువల్లనే ఆధునిక నగరాలలో భవన నిర్మాణం తప్పనిసరిగా పాటించవలసిన నియమ నిబంధనలున్నాయి. ఆ నియమ నిబంధనలు విధించడానికి, నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి, ఉల్లంఘనలమీద జరిమానాలు విధించి, సవరణలు చేయడానికి అనేక వ్యవస్థలున్నాయి. అసలు ఒక భవనం నిర్మించడానికి ముందే సమస్త అనుమతులూ ఇవ్వడానికి, షరతులు విధించడానికి వ్యవస్థలున్నాయి.
నాలుగు వందల ఇరవై ఐదు సంవత్సరాల నగరంలో పాత భవనాల స్థితి మరింత సంక్లిష్టమైనది. మొదట అక్కడ యజమాని ఎవరనేది ఒక వివాదాస్పద అంశం. గుల్జార్ హౌజ్ కు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందంటున్నారు. పాత నిర్మాణం మీదనే కొత్తగా అతుకులూ, విస్తరణలూ, కూల్చి కట్టడాలూ జరిగి ఉండవచ్చు. ఒక్క అడుగు కూడా ఖాలీ వదలకుండా భవనం పక్కన భవనం పక్కన భవనంగా ఒకదాని మీద ఒకటి పెరిగిపోయాయి. ఇప్పుడు అగ్ని ప్రమాదానికి గురైన భవనం బైటి నుంచి చూస్తే రెండు అంతస్తుల్లా కనబడుతుంది, వాస్తవానికి మూడు అంతస్తులున్నాయని అగ్నిమాపక సిబ్బంది గుర్తించిందని వార్తలు వస్తున్నాయి. కింద మూడు దుకాణాలు ఉండగా, ఒక దుకాణం లోపలి నుంచి పైకి మెట్లు ఉండి, పైన ఎనిమిది గదుల ఇల్లు ఉంది. ఆ ఎనిమిది గదులకు గాలీ వెలుతురూ అవకాశాలు లేవు గనుక, కనీసం ఐదు గదుల్లో ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. అంటే విపరీతంగా, సగటు ఇంటికన్న ఎక్కువగా విద్యుత్తు వాడకం జరుగుతున్నది. అంతగా విద్యుత్తు వాడకం జరుగుతుంటే బైటి నుంచి సరఫరా లైన్లు గాని, లోపలికి వచ్చాక నియంత్రణా పరికరాలు గాని, లోపల విద్యుత్తు లైన్లు గాని ఉండవలసినంత పకడ్బందీగా ఉన్నాయో లేవో తెలియదు. ఆ విషయం పర్యవేక్షించవలసిన అధికారులు ఏమి చేస్తున్నారో తెలియదు.
కాని అన్ని ఆధునిక నగరాలలోనూ, వ్యాపార లాభాపేక్ష కోసం రియల్ ఎస్టేట్ ధరలను కృత్రిమంగా ఇబ్బడి ముబ్బడిగా పెంచినందువల్ల, ఒక చదరపు అడుగు నేల కూడా వదలడానికి ఆస్తి స్పృహ, ఖరీదు యావ అడ్డు వస్తున్నాయి. కనుక ప్రతి గృహస్తూ, ప్రతి భవన నిర్మాణ గుత్తేదారూ, ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ నియమ నిబంధనలు ఎట్లా ఉల్లంఘించగలమా అనే ప్రయత్నిస్తుంటారు. ఆ ఉల్లంఘనలను చూసీ చూడనట్టు పోవడానికి పర్యవేక్షక వ్యవస్థల అధికారులకు లంచగొండితనం మప్పుతారు. లేదా ఆ అధికారులే లంచగొండులై, గృహస్తులకూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకూ ఉల్లంఘన మార్గాలు చెపుతారు. చివరికి నగరమంతా ఎక్కడా నియమ నిబంధనలు సక్రమంగా అమలు కాని, ఉల్లంఘనలను అడ్డుకోలేని అవ్యవస్థ రాజ్యమేలుతుంది. పర్యవేక్షక సంస్థలు, అధికారులు నిస్సహాయంగా, అవినీతిమయంగా మారిపోతారు.
ఇదంతా కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన విషయం కాగా, ఈ నాలుగు వందల ఇరవై ఐదు సంవత్సరాల నగరంలో పాత భవనాల స్థితి మరింత సంక్లిష్టమైనది. మొదట అక్కడ యజమాని ఎవరనేది ఒక వివాదాస్పద అంశం. గుల్జార్ హౌజ్ కు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉందంటున్నారు. పాత నిర్మాణం మీదనే కొత్తగా అతుకులూ, విస్తరణలూ, కూల్చి కట్టడాలూ జరిగి ఉండవచ్చు. ఒక్క అడుగు కూడా ఖాలీ వదలకుండా భవనం పక్కన భవనం పక్కన భవనంగా ఒకదాని మీద ఒకటి పెరిగిపోయాయి. ఇప్పుడు అగ్ని ప్రమాదానికి గురైన భవనం బైటి నుంచి చూస్తే రెండు అంతస్తుల్లా కనబడుతుంది, వాస్తవానికి మూడు అంతస్తులున్నాయని అగ్నిమాపక సిబ్బంది గుర్తించిందని వార్తలు వస్తున్నాయి. కింద మూడు దుకాణాలు ఉండగా, ఒక దుకాణం లోపలి నుంచి పైకి మెట్లు ఉండి, పైన ఎనిమిది గదుల ఇల్లు ఉంది. ఆ ఎనిమిది గదులకు గాలీ వెలుతురూ అవకాశాలు లేవు గనుక, కనీసం ఐదు గదుల్లో ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. అంటే విపరీతంగా, సగటు ఇంటికన్న ఎక్కువగా విద్యుత్తు వాడకం జరుగుతున్నది. అంతగా విద్యుత్తు వాడకం జరుగుతుంటే బైటి నుంచి సరఫరా లైన్లు గాని, లోపలికి వచ్చాక నియంత్రణా పరికరాలు గాని, లోపల విద్యుత్తు లైన్లు గాని ఉండవలసినంత పకడ్బందీగా ఉన్నాయో లేవో తెలియదు. ఆ విషయం పర్యవేక్షించవలసిన అధికారులు ఏమి చేస్తున్నారో తెలియదు.
ఇటువంటి పాత భవనాలను కూడా కొత్త నిబంధనల కిందికి తేవడం రియల్ ఎస్టేట్ ధరల వల్ల కష్టసాధ్యం కావచ్చు గాని, మంచి నీరు, మురుగు నీరు, విద్యుత్తు, టెలిఫోన్, రోడ్ల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాల కోసం భూసేకరణ, భూస్వాధీనం, నష్టపరిహారం వంటి మార్గాలు అనుసరిస్తున్న నగర పాలక సంస్థ, భవన నిర్మాణ అనుమతుల యంత్రాంగాలు ఇక్కడ కూడా తగిన నియమ నిబంధనలు ప్రకటించవచ్చు, అమలు చేయవచ్చు. విద్యుత్ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఇటువంటి చోట్ల ప్రమాద అవకాశాలు ఉన్నాయా తనిఖీ చేస్తూ ఉండవచ్చు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని మొదటి వార్తలు రాగా, షార్ట్ సర్క్యూట్ జరగలేదని ప్రకటన ఇచ్చి తమ బాధ్యత వదిలించుకోవడానికే విద్యుత్ అధికారులు ప్రయత్నించారు. ఒక రోజు గడిచాక ఆ ప్రమాదం ఎయిర్ కండిషనర్ల కంప్రెసర్లు పేలిపోవడం వల్ల జరిగిందంటున్నారు. నిజానికి మూడు మడిగెల, ఎనిమిది గదుల ఇంటికి ఎంత లోడ్ విద్యుత్తు అవసరమవుతుంది, ఎంత వాడుతున్నారు, ఈ ఒత్తిడి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందా ముందే అంచనా వేసి, తగిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత విద్యుత్ అధికారులదే.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని మొదటి వార్తలు రాగా, షార్ట్ సర్క్యూట్ జరగలేదని ప్రకటన ఇచ్చి తమ బాధ్యత వదిలించుకోవడానికే విద్యుత్ అధికారులు ప్రయత్నించారు. ఒక రోజు గడిచాక ఆ ప్రమాదం ఎయిర్ కండిషనర్ల కంప్రెసర్లు పేలిపోవడం వల్ల జరిగిందంటున్నారు. నిజానికి మూడు మడిగెల, ఎనిమిది గదుల ఇంటికి ఎంత లోడ్ విద్యుత్తు అవసరమవుతుంది, ఎంత వాడుతున్నారు, ఈ ఒత్తిడి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందా ముందే అంచనా వేసి, తగిన చర్యలు తీసుకోవలసిన బాధ్యత విద్యుత్ అధికారులదే.
లక్షల, కోట్ల రూపాయల ముత్యాల, ఆభరణాల వ్యాపారం చేసే ఇటువంటి దుకాణాలలో, కిక్కిరిసి కలిసి ఉన్న ఇళ్లలో విద్యుత్ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో, జరిగితే తక్షణమే మనుషులను ఎలా ఖాలీ చేయించాలో, ప్రమాద నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని ఎలా తగ్గించవచ్చునో అధికారిక వ్యవస్థ నుంచి వ్యాపారులకు సూచనలు, సలహాలు ఉండాలి. తప్పనిసరిగా ప్రతి దుకాణంలోనూ ఉండవలసిన పరికరాలు, ఏర్పాట్లు సూచించాలి. అధికారిక వ్యవస్థలు ఇటువంటి వ్యాపారస్తుల దగ్గర మామూళ్ల వసూలుకు తప్ప మరొక పని మీద వెళతారనే నమ్మకం లేదు.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన వ్యవస్థలన్నీ తమ బాధ్యతలు నిర్వర్తించకపోగా, దుర్ఘటన జరిగిన తర్వాత తక్షణ సహాయ చర్యలు చేపట్టవలసిన వ్యవస్థల బాధ్యతా రాహిత్యం గురించి బాధిత కుటుంబ సభ్యుల దగ్గరి నుంచి ప్రతిపక్ష రాజకీయ నాయకుల వరకు ఎందరో ఆరోపణలు చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లు ఆలస్యంగా వచ్చాయని, నీరు లేదని, మాస్కులు లేవని మరింత ఆలస్యం చేశారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. వచ్చిన హాస్పిటల్ ఆంబులెన్సులలో ఆక్సిజన్ సిలిండర్లు లేవని, అధికారుల అలసత్వం వల్లనే ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిందని అంటున్నారు. నిజానికి ఇటువంటి శాఖలు ఇరవై నాలుగు గంటలూ ఏ క్షణమైనా ప్రమాదం జరగవచ్చునని, క్షణాల్లో అక్కడికి చేరి సహాయ చర్యల్లో పాల్గొనాలని, సంపూర్ణ సన్నద్ధతతో ఉండాలి. కాని లేవని స్పష్టంగా బైటపడుతున్నది.
ఇన్ని కారణాల వల్ల మరణాలు సంభవిస్తాయి. కుటుంబాలు నాలుగురోజులు ఏడ్చి ఊరుకుంటాయి. ప్రాణాలు తిరిగి రావు, కర్మ ఫలితంగానే మరణం సంభవించింది అని తమను తాము ఓదార్చుకుంటాయి. ప్రచారసాధనాలు రెండు రోజులు గోల చేసి ఊరుకుంటాయి. ప్రచార సాధనాలకు ప్రతి గంటా, ప్రతి నిమిషమూ కొత్త సమస్యలు ముంచుకొస్తుంటాయి గనుక గడిచిపోయిన సమస్య గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచించే వ్యవధే ఉండదు. మరి అధికార వ్యవస్థలైనా, సమాజమైనా సమస్య నుంచి సమస్య నుంచి సమస్యకు ప్రమాదాల విషవలయంలో గానుగెద్దులా తిరిగే బదులు, ఈ సమస్యల మూల కారణాలేమిటి, వాటిని ఎలా పరిష్కరించవచ్చు, కనీసం ఎలా తగ్గించవచ్చు అని ఆలోచించకపోతే ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు.





