– ఏం జరుగుతుందోనని రాజకీయంగా చర్చ
– ఉప ఎన్నికలపై ఆశ పెట్టుకున్న బీఆర్‌ఎస్
హైదరాబాద్ ,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించుకున్న క్రమంలో ఏం జరగబోతుందన్న చర్చ సాగుతోంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఉత్కంఠగా చూస్తున్నా రు. ముఖ్యంగా విపక్ష బిఆర్‌ఎస్ ఈ విషయం లో ఆసక్తిగా ఉంది. ఎలాంటి నిర్ణయం రాబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికలు రావాలని కూడా బిఆర్‌ఎస్ కోరుకుంటోంది. సుప్రీం తీర్పు ఆధారంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐదుగురు ఎమ్మె ల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే మిగి లిన మరో ఐదుగురికి కూడా త్వరలో నోటీసు లు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోం ది. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధిం చి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్దేశిరచిన గడువు లోపల పదిమంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ ప్రసాద్‌కుమార్ నిర్ణయం ప్రకటిస్తారా..? లేక పెండింగ్‌లో పెడతారా..? అన్నది చర్చనీయాం శంగా మారింది. మరోవైపు, ఫిరాయింపు ఆరో పణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామం టూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసన సభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే నమోదై వున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరా యించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బీఆర్‌ఎస్‌లో గెలించి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యే ల్లో ఐదుగురికి శుక్రవారం నోటీసులు పంపిం చారు. వీరి విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నది. వొచ్చే వారం నుంచి వీరి విచారణ ప్రారంభమ య్యే అవకాశం ఉన్నది. బీఆర్‌ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. ఆ తర్వాతే ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకొన్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. కాగా, తనకు నోటీసులు అందాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





