స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:‌ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌తో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్‌ ‌గౌడ్‌లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ ‌బాబు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌నోటీసులకు ఇప్పటికే కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్‌ ‌గౌడ్‌లు వివరణ ఇచ్చారు. అయితే, ఈ నెల 30వ తేదీ వరకూ కడియం శ్రీహరి గడువు కోరారు. ఈనెల 29 నుంచి స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్‌ 6‌వ తేదీ నుంచి 23వ తేదీ వరకు విదేశీ పర్యటనకు అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌వెళ్లనున్నారు. విదేశీ పర్యటనకు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌తో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *