– నైజీరియన్ల నుంచి కొనుగోలు
– భారీగా స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: నగరంలోని గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్‌ఎం లగ్జరీ గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని ఎస్‌వోటీ పోలీసులు భగ్నం చేశారు. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మాదాపూర్ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో ఉంటున్న ఇద్దరు నైజీరియన్ల నుంచి తేజ కృష్ణ డ్రగ్స్ కొనుగోలు చేశారని వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరు నైజీరియన్లు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకు వొచ్చి తేజ లోకల్‌గా ఉన్న యువత, స్టూడెంట్లకు అమ్ముతారన్నారు. ఇప్పటివరకు అన్ని లావాదేవీలు కలెక్ట్ చేశామని.. నిందితులు రిమాండ్ చేసినట్లు చెప్పారు. పట్టుబడ్డ తేజ కృష్ణ ఆర్కిటెక్ట్ అని.. కడపకు చెందిన వ్యక్తిగా తెలిపారు. మొత్తం ఈ కేసులో 19 మంది ఉన్నారు..వారి 9 మంది ఫెడ్లర్లు ఉన్నారన్నారు. పరారీలో ఉన్నవారిలో నలుగురు ఫెడ్లర్లు ఉన్నారని చెప్పారు. తేజ కృష్ణపై గతంలో మూడు ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయని డీసీపీ ఉదయ్ రెడ్డి వెల్లడించారు. మాదాపూర్ ఎస్‌ఓటీ గచ్చిబౌలి పోలీసులు ఎస్‌ఎం కో లివింగ్ హాస్టల్లో రైడ్ నిర్వహించారని తెలిపారు. కో లివింగ్ హాస్టల్‌లో తేజ కృష్ణ, లోకేష్ రెడ్డి వద్ద డ్రగ్స్ లభించాయని చెప్పారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురు.. హోటల్ నైట్ ఐలో దొరికారన్నారు. వారిని అదుపులోకి తీసుకున్నామని.. వారి వద్ద కూడా డ్రగ్స్ లభించినట్లు తెలిపారు. మొత్తం ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశామని.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు ఫెడ్లర్లు, ఐదు మంది కన్యూమర్లు ఉన్నారన్నారు.
డ్రగ్స్ వాడకం… వ్యాపారం
- ముషీరాబాద్ డాక్టర్ నిర్వాకం.. దాడి చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు
ముషీరాబాద్‌లో ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు మూడు లక్షల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు యువకులతో కలిసి జాన్ పాల్ అనే డాక్టర్ దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి అమ్మకాలు సాగిస్తున్నారు. ముషీరాబాద్‌లో ఓ ఇంట్లో ఉంటూ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నాడు. పక్కా సమాచారంతో డాక్టర్ ఇంట్లో సోదాలు జరిపిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్‌బీ బృందానికి భారీగా డ్రగ్స్ లభించింది. వైద్యుడి ఇంట్లో డ్రగ్స్‌ను చూసి ఎక్సైజ్ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురు స్నేహితులు కలసి డ్రగ్స్ దందా చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే యువకులు.. బెంగుళూరు, దిల్లీ నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి.. డాక్టర్ జాన్‌పాల్ నివాసంలో పెట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. ఇందుకు డాక్టర్ సహకరించాడు. డాక్టర్ స్వయంగా డ్రగ్స్ వాడటంతో పాటు వాటిని అమ్మకాలు జరుపుతున్నట్లు ఎస్టీఎఫ్ టీం గుర్తించింది. డ్రగ్స్ దందాపై సమాచారం అందిన వెంటనే ఎస్టీఎఫ్ బృందం డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు నిర్వహించారని…. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్లు ప్రదీప్ తెలిపారు. డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో ఓజి కుష్, ఎండిఎంఎ, ఎల్‌ఎస్‌డి బాస్టస్, కొకైన్, గుమ్మస్, హాసిస్ ఆయిల్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. మూడు లక్షలు ఉంటుందని తెలిపారు. అయితే డ్రగ్స్ తెప్పిస్తున్న ప్రమోద్, సందీప్, శరతులు ప్రస్తుతం పరారీలో ఉండగా.. వీరిపై కూడా కేసు నమోదు అయ్యింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





