ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన‌ సోనియాగాంధీ

  • రూ.12,500 కోట్లతో   6.70 లక్షల ఎకరాలు సాగులోకి
  • గిరిజనులకు రూ 17,169 కోట్లు కేటాయింపు
  • పదేళ్లలో  సబ్‌ ‌ప్లాన్‌ ‌నిధులు ఖర్చు చేయని టిఆర్‌ఎస్‌‌
  • డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఆత్మగౌరవ నినాదం, 85శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రతిఫలాలు దక్కాలననే ఆలోచనతో సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.  శనివారం కొత్తగూడెం జిల్లా పాల్వంచలో  ఆదివాసీ నాయకులకు శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. టిఆర్ఎస్ పాలనలో సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయలేదు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక సబ్ ప్లాన్ నిధులను తూచా తప్పకుండా ఖర్చు చేస్తున్నామ‌న్నారు.  ప్రజా ప్రభుత్వంలో సబ్ ప్లాన్ నిధులు తూచా తప్పకుండా ఖర్చు చేస్తున్నాం . సబ్ ప్లాన్ కింద గిరిజనులకు రూ. 17,169 కోట్లు కేటాయించాం, గతంలో ఖర్చు చేయని రూ. 1,296 కోట్ల నిధులు క్యారీ ఫార్వర్డ్ చేశామ‌న్నారు. సబ్ ప్లాన్ ద్వారా పథకాలకు నిధులు కేటాయిస్తున్న విషయాన్ని ఇంటింటికి తీసుకువెళ్లాలని శిక్షణకు హాజరైన నాయకులను కోరారు. ఆత్మగౌరవం, సమ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సాధ్యం. అందుకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టాం. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామ‌న్నారు. గిరిజనుల హక్కులు ఆత్మగౌరవం కాపాడేందుకే నల్లమల‌ డిక్లరేషన్ తీసుకువచ్చామని ఆయ‌న తెలిపారు.

ఏ ఇంటికి ఏ పథకాలు అందుతున్నాయి, ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో పూర్తి వివరాలను త్వరలో ఇంటింటికి పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.  నాయకులుగా సంక్షేమ పథకాల పై ప్రచారం చేయ‌డ‌మే కాకుండా అర్హులతో దరఖాస్తులు చేయించాల‌ని సూచించారు. గిరిజనుల అవసరాలు ఏంటో తెలుసుకొని ఆ వర్గాల నాయకులను ఒకచోట చేర్చి ఏఐసిసి ద్వారా అమలు చేసేందుకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామ‌న్నారు. ధరణి పేరుతో అసైన్డ్ భూములను హస్త గతం చేసుకుంటుంటే ఆందోళనలు చేశాం. అధికారంలోకి వచ్చాం భూభారతి చట్టాన్ని తెచ్చామ‌న్నారు.  రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూ. వెయ్యి కోట్ల నిధుల కేటాయింపు దేశ చరిత్రలోనే  ఓ రికార్డుగా నిలిచిపోతుంద‌న్నారు.  అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో బతికేందుకు ఇందిరా సౌర గిరిజన వికాసం తీసుకువచ్చాం. రూ. 6.70 లక్షల ఎకరాలను రూ. 12,500 కోట్లు ఖర్చు చేసి సాగులోకి తీసుకువస్తామ‌న్నారు.

ఆత్మగౌరవం, సమ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సాధ్యం.. అందుకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టాం. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అన్నారు. నివసించేందుకు ఇందిరమ్మ ఇల్లు, అనారోగ్యం పాలైతే పది లక్షల వైద్య పరిమితి కలిగిన ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారికి రాజీవ్ యువ వికాసం వంటి స్వయం ఉపాధి పథకాలు, విదేశాల్లో చదువుకునే వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్, గిరిజనులు భూములు సాగు చేసుకునేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసం, పంటలకు గిట్టుబాటు ధర, పామాయిల్ వంటి పంటలకు బై బ్యాక్, సన్నధాన్యానికి బోనస్.. వృద్ధులకు పెన్షన్ ఇలా ఏ ఒక్కరిని వదలకుండా సంక్షేమానికి కట్టుబడి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ఆత్మగౌరవ నినాదం, 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రతిఫలాలు దక్కాలని ఆలోచనతో సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు, టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిధులు రాలేదు ఆత్మగౌరవం అంతకన్నా దక్కలేదు అని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు. జల్, జంగల్, జమీన్ , ధన్యవాదాలు భూమి వంటి ఉద్యమ ఆకాంక్షలను చట్టాలుగా చేర్చి భూ సంస్కరణలు, కౌలుదారు చట్టం ద్వారా తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికేలా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయ‌న్నారు.

టిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రెసిడెన్షియల్ పాఠశాలలకు నిధులు కావాలని అడిగినా ఇవ్వలేదు ప్రజా ప్రభుత్వం రాగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నాం, సంక్షేమ విద్యార్థుల డైట్ చార్జీలు 40% కాస్మోటిక్ ఛార్జీలు 25% పెంచాం, మరమ్మతులు చేపట్టాల్సిన పాఠశాలల భవనాలకు సంబంధించి నివేదిక అడిగాం అది రాగానే సీఎం దృష్టికి తీసుకువెళ్లి విధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామ‌న్నారు.  అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో బతికేందుకు 2006లో అటవీ హక్కు చట్టం కింద గిరిజనులు సాగు చేసుకుంటున్నా భూములకు కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు.  అడవి హక్కుల చట్టం కింద వచ్చిన భూములను సాగు చేసుకునేందుకు గిరిజనులు వెళితే మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర గత పాలకులది అని డిప్యూటీ సీఎం తెలిపారు.  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో గిరిజనుల ఆధీనంలో ఉన్న 6.70 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసం అనే పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు.

ఈ పథకం ద్వారా గిరిజనులకు ఉచితంగా పంపుసెట్లు, సోలార్ విద్యుత్తు, సాగు చేసుకునేందుకు అవకాడో పామాయిల్ లాంటి మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన పట్టాలతో పాటు ఆత్మగౌరవంతో బతకడానికి గిరిజనులకు నిధులు కేటాయించాం. నల్లమల డిక్లరేషన్తో పనులు మొదలు పెట్టామని తెలిపారు. తాను డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలోనే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను అసెంబ్లీలో ఆమోదింప చేసిన విషయాన్ని గుర్తు చేశారు.రూ. 22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తామ‌న్నారు.  రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 4.50 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం ఇందుకుగాను ప్రభుత్వం రూ. 13,500 కోట్లు వెచ్చిస్తుందని వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకంతో తిరిగిన కుటుంబాలు నూటికి నూరు శాతం లబ్ధి పొందుతున్నాయని తెలిపారు.

ప్రతి ఇంట్లో ఏ ఏ పథకాలు అందుతున్నాయి, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, యువ వికాసం వంటి పథకాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని రూపొందిస్తున్నాం, ఈ వివరాలను ఇంటింటికి చేరుస్తాం,  పార్టీ నాయకులు ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *