సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ కాంగ్రెస్‌

– హామీ ప్రకారం బీసీలకు స్థానికంలో రిజర్వేషన్‌ కల్పించాం
– అన్ని పార్టీలు మ‌ద్ద‌తు తెలపాలి
– బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల అభిప్రాయానికనుగుణంగా కుల సర్వే నిర్వహించి అందుకనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్‌ 9 విడుదల చేసిందని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ కాంగ్రెస్‌ అని చెప్పారు. మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి గాంధీ భవన్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కులగణనపై డెడికేటెడ్‌ కమిషన్‌, సబ్‌ కమిటీ వేసి కేబినెట్‌లో చర్చించి శాసన సభలో అన్ని పార్టీల మద్దతుతో ఆమోదం పొంది గవర్నర్‌ ఆమోదానికి, తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపామని చెప్పారు. రాష్ట్రపతి ఆమోదం తెలపాలని దేశం మొత్తం ఎంపీలతో కలిసి దిల్లీలో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పెండిరగ్‌లో ఉన్న బిల్లు మూడు నెలలు మించి గవర్నర్‌ ఈమోదించకపోతే ఆమోదించుకున్నట్టే అని తమిళనాడు విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు పేర్కొందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికి అన్యాయం జరగదన్నారు. ప్రామాణిక లెక్కల ప్రకారం, ప్రజల అభిప్రాయం ప్రకారం ఇది అమలు చేస్తున్నామన్నారు. 8వ తేదీ కోర్టు వాదనలు వింటామనీ తెలిపిందని, ఈ కార్యాచరణలో అనేక అడ్డంకులు, అవాంతరాలు ఎదుర్కొని ఇక్కడివరకు వచ్చామని చెప్పారు. సామాజిక కోణంలో, సామాజిక న్యాయం కాంక్షించే ప్రతి వ్యక్తీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాల వద్ద సుమోటోగా ఉండేలా మద్దతు ఇవ్వాలని పొన్నం కోరారు. రాజకీయ వేదికల్లో బలహీన వర్గాలకు 100 శాతం రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని, శాసనసభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ, జనసమితి అన్ని పార్టీలు, కుల సంఘాలు సామాజిక న్యాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందని, 42 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌కు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తాను, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తామన్నారు. రాజకీయ భేషజాలకు పోమని, 10శాతం ఈడబ్ల్యూస్‌ రిజర్వేషన్లకు ఇచ్చినప్పుడు 50 శ్లాబ్‌ ఎత్తివేయడం జరిగిందన్నారు. అప్పుడే 50 శాతం పరిమితులు దాటిపోయాయన్నారు. తమ నాయకుడు రాహుల్‌ గాంధీ సామాజిక న్యాయంపై తీసుకున్న నిర్ణయానికనుగుణంగా ముందుకు పోతున్నామని పొన్నం చెప్పారు. మా నోటి కాడి ముద్ద లాగద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. 9వ తేదీ నుండి నోటిఫికేషన్‌ రాగానే నామినేషన్‌లు మొదలవుతయని, రాజకీయ పార్టీలుగా సామాజిక న్యాయం కావాలని అడుగుతున్న దానిపై మీ న్యాయవాదుల బృందంతో అఫిడవిట్లు పంపాలని కోరారు.
పక్కనున్న తమిళనాడులో షెడ్యూల్‌ 9లో పొందుపరిచి 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కుల సర్వేకి అంగీకరించిందని, రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. 50 కాబ్‌ మాట్లాడుతున్న వారు దేశలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లు గమనించాలని, 50 శాతం కాబ్‌ దాటి రిజర్వేషన్లు ఆయా స్థానిక పరిస్థితులనుబట్టి జనాభాను బట్టి మారుతుందని తెలిపారు. దేశంలోనే తొలి సామాజిక మార్పుకి శ్రీకారం చుడుతున్న తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ జడ్పిపి, సర్పంచ్‌ స్థానాలకు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు.
పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని, తాము ఎవరిరీి వ్యతిరేకం కాదు.. సామాజిక మార్పుకు తాము తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపండి అని తమ సంఘాల తరపున పిటిషనర్లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో సామాజిక న్యాయానికి తొలి ప్రజాప్రతినిధులు మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. ప్రభుత్వ పక్షాన, పార్టీ పక్షాన, బలహీనవర్గాల పక్షాన సామాజిక న్యాయానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడానికి ఇంతకన్నా బెస్ట్‌ ఏముందో చెప్పు అని బీజేపీ జాతీయ బీసీ సెల్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను బహిరంగంగా అడుగుతున్నానన్నారు. మీ అధిష్టానంతో మాట్లాడి రాష్ట్రపతి దగ్గర పెండిరగ్‌లో ఉన్న బిల్లు ఆమోదింపజేయాలని కోరారు. రిజర్వేషన్లకు వ్యతిరేక భావజాలం పెరగలేదు అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీసీ రిజర్వేషన్‌లకు మద్దతు తెలపాలని, పాయల్‌ శంకర్‌ లాంటి వారు తమ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి రిజర్వేషన్లు ఆమోదం తెలపాలని కోరుతున్నానని పొన్నం అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *