– ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ వెల్లడి
న్యూఢల్లీి, ప్రజాతంత్ర, ఆగస్ట్6: కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దిల్లీలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీ ధర్నాపై ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలనే డిమాండ్‌తో ధర్నా జరిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ మహాధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నా. బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగు అవుతుంది. ఈ పోరాటం కేవలం తెలంగాణ కోసమే కాదు. దేశంలోని అణగారిన వర్గాలందరి కోసం. ఈ ధర్నాకు హాజరైన ఇండియా కూటమి నేతలకు ధన్యవాదాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.





