ఎస్ఎల్‌బీసీ ప‌నుల్లో ఆల‌స్యం వొద్దు

– స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 04: జూబ్లీహిల్స్ నివాసంలో ఎస్ఎల్ బీసీ పనుల పునరుద్దరణ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంనిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ఎస్‌ ఎల్ బీ సీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని స్ప‌ష్టం చేశారు. ఎస్ ఎల్ బీ సీ కేవలం నల్గొండ జిల్లా కే కాదు తెలంగాణ అత్యంత కీలకం.. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్ బీసిలో అవకాశం ఉంద‌న్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యల పైన తక్షణమే సంచారం ఇవ్వాలన్నారు. అటవీ శాఖ అనుమతులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి.. 2027 డిసెంబరు 9 లోగా ఎస్ ఎల్ బీ సీ ని పూర్తి చేయాలి. డిసెంబర్ 9 ,2027 న తెలంగాణ ప్రజలకు ఎస్ ఎల్ బీ సీ ని అంకితం చేయాల‌న్నారు. ఎస్ ఎల్ బీ సీ పనులకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది.  సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపి అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలి. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకోనన్నారు. సొరంగం త‌వ్వకం లో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. ఎస్ ఎల్ బీ సీ పనులకు నిరంతరాయం గా విద్యుత్ సరఫరా జరగాలి.. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ ఎల్ బీ సీ పూర్తి కావాలి..పనులు ఆగడానికి వీలు లేదని స్ప‌ష్టం చేశారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,నీటి పారుదల శాఖ గౌరవ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్,నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కల్నల్ పరిక్షిత్ మెహ్రా , ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *