డెడ్‌ అయిన పార్టీ డెడ్‌లైన్‌ పెట్టడమేంటి?

కేటీఆర్‌ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 5: మంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి విసిరిన సవాల్‌ కేటీఆర్‌కు అర్దం కానట్లు ఉంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విదేశాలలో ఉన్న కేటీఆర్‌ తాను తెలంగాణకు వచ్చినట్లు చెప్పేందుకే ప్రెస్‌ మీట్‌ పెట్టినట్టుగా ఉందన్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌ గుర్తింపు సమస్యతో బాధపడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే ప్రెస్‌ క్లబ్‌కు రమ్మనడం ఏంటి? ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ప్రెస్‌క్ల్లబ్‌లో చర్చించడానికి కాదు.. 72 గంటల డెడ్‌లైన్‌ అంటూ అర్థం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నాడు.. డెడ్‌ అయిన పార్టీ డెడ్‌ లైన్‌ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నీ సొంత చెల్లే నిన్ను నాయకునిగా గుర్తించడం లేదు.. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడా… సమస్యలపై చర్చిద్దాం రా అంటే భయమెందుకు అని సీతక్క కేటీఆర్‌ను ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *