– అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
– జూబ్లీహిల్స్‌లో జోరుగా సాగుతున్న మంత్రి సీతక్క ప్రచారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌కు మూడుసార్లు అవకాశం ఇచ్చినా అభివృద్ది జరగలేదని, ఆ పార్టీ ఎమ్మెల్యే ఉండికూడా కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికలో తమ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం ఆమె విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం కార్యకర్తలకు అల్పాహారం వడ్డించి వారితో, కార్పొరేషన్ చైర్మన్లు మువ్వా విజయ్ కుమార్, బండ్రు శోభారాణి, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌తో కలసి బుధవారం ప్రచారం నిర్వహించారు. అభ్యర్ది నవీన్ యాదవ్‌తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు కూడా. స్వయంగా కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ అభ్యర్దిని గెలిపించాలని ఓటర్లకు సీతక్క విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూ.150 కోట్ల పనులు మంజూరయ్యాయని, పేదల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు పంపిణి చేశామమని, పేదల కడుపు నింపేందుకు సన్న బియ్యం ఇస్తున్నామని, 4.5 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని వివరించారు. జూబ్లీహిల్స్ అభివృద్ది కోసం నవీన్ యాదవ్‌ను గెలిపించుకోవడం చాలా అవసరం అని పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





