20న నుంచి టిక్కెట్ కౌంటర్ ప్రారంభం
భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 7వ తేదీన మహా పట్టాభిషేకం ఉత్సవాలను వీక్షించే భక్తుల సౌకర్యార్థ్యం ఆన్‌లైన్ ద్వారా సెక్టార్‌ల టిక్కెట్లు ముందుగా పొందే అవకాశం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈఓ ఎల్ రమాదేవి తెలిపారు. కల్యాణ మహోత్సవానికి సెక్టార్ టిక్కెట్లు 7500/`(ఉభయ దాతలు) , 2500/`, 2000/`,1000/`,300/`, 150/` అలాగే పట్టాభిషేకానికి 15000/`, 500/`, 100/` టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 20వ తేది నుంచి నేరుగా సెక్టార్ టిక్కెట్లు ఆలయం వద్ద గల మెయిన్ టిక్కెట్ కౌంటర్, తానీషా కల్యాణ మండపం, బ్రిడ్జి పాయింట్ (సిఆర్‌ఓ) వద్ద నేరుగా విక్రయించనున్నట్లు తెలిపారు. ఆర్‌డిఓ కార్యాలయం వద్ద ఏప్రిల్ 1వ తేది నుంచి విక్రయించబడుతున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు విచ్చేసే అవకాశం లేని భక్తులు గత సంవత్సరం వలె పరోక్షంగా భక్తులు వారి గోత్రనామాలతో కల్యాణం జరిపించుకునేందుకు పరోక్ష సేవలు 5000/`, 1116/` ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంచామని తెలిపారు.
https://bhadradritemple.telangana.gov.in ద్వారా ఈ నెల 12వ తేది నుండి టిక్కెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ నుండి సెక్టార్ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఈ నెల20వ తేది ఉదయం 11 గంటల నుండి ఏప్రిల్ 6వ తేది ఉదయం 6గంటల వరకు దేవస్థానం తానీషా కల్యాణ మండపం కార్యాలయం(సిఆర్‌ఓ) నందు ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి ఒరిజినల్ టిక్కెట్టు తీసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.




