– జూలై ఆఖరులోగా రైతులకు సాగునీరందించాలి
– ఉగాదిలోగా పెద్దారెడ్డి లిఫ్ట్ పనులకు శంకుస్థాపన జరగాలి
– సింగూరు సుందరీకరణ, పరిరక్షణ పనులు వేగంగా పూర్తి చేయాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26లోగా పూర్తిచేయాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులన మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. సచివాలయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధ్యక్షతన సింగూరు ప్రాజెక్టు డ్యాం సేఫ్టీపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్, ఈఎన్‌సీలు, ఇంజనీరింగ్ శాఖ ముఖ్య అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సింగూరు డ్యాం సేఫ్టీపై చర్చించారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు సింగూర్ డ్యాంను పరిరక్షించాలని మంత్రులు అధికారులన” ఆదేశించారు. సింగూరు డ్యామ్ సేఫ్టీ నిర్మాణ పనులపై సాంకేతిక కమిటీని నియమించాలని సూచించారు. ఆందోల్ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరందించే పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం డీపీఆర్‌లను శరవేగంగా రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు ఉగాదిలోగా శంకుస్థాపనకు శ్రీకారం చుట్టాలని, సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. సింగూర్ సుందరీకరణ, పరిరక్షణ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు దామోదర్, ఉత్తంకుమార్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆందోల్ నియోజకవర్గంలో చిన్న నీటి ప్రాజెక్టులైన చెరువుల పునరుద్ధరణ పనుల టెండర్లను పూర్తిచేసి ఈ సీజన్‌లో రైతులకు సాగునీరందించాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్, ఈఎన్సీలు రమేష్‌బాబు, శ్రీనివాస్, టి.శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ ఎసఈ బి.రాజమ్మ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ఇన్‌చార్జి ఎసీఈ రఘునాథ రావు, ఈఈ బీమ్, డీఈ నాగరాజ్, ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





