సింగరేణి కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తాం

– కార్మికుల సంక్షేమానికి పెద్దపీట
– అధికారులతో సమానంగా సౌకర్యాలు
– ఉద్యోగుల పేరు మార్పుల సమస్యకు పరిష్కారం,
– కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో సింగరేణి కార్మికుల కోసం తాజాగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల మారు పేరు విషయానికి సంబంధించి త్వరగా పరిష్కరిస్తామని, మెడికల్ ఇన్‌వాల్యుయేషన్‌లో వాళ్లకున్న జబ్బులకు సంబంధించి బోర్డు పరిధిలో అన్ని విధాల పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కోల్ ఇండియా నిబంధన మేరకు సింగరేణిలో అధికారులకు ఏ విధమైన సౌకర్యాలను భరిస్తున్నదో అలాగే కార్మికులకు కూడా అన్ని సౌకర్యాలు (టాక్స్) కల్పించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణి ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఐఫోర్ కమిటీ నిర్ణయించి సొంతింటి కల సహకారం చేస్తుందన్నారు. సింగరేణి ఉద్యోగు లం దరికీ దేశంలో ఎక్కడా లేని రీతిలో రూ.1.25 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకం దేశవ్యాప్తంగా ఒక నమూనా పథకంగా గుర్తింపు పొందిందన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల కోసం రూ.40 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్లు, కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సింగరేణిలో 2,539 పోస్టులను భర్తీ చేశామన్నారు. వీటిలో 798 ఎక్స్‌టర్నల్ పోస్టులు ఉండగా 1,741 కారుణ్య నియామక ఉద్యోగాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు..క్యాథ్ లాబ్‌ల ఏర్పాటు ద్వారా సింగరేణి హాస్పిటల్స్‌ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌గా మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.. 2024-25లో సింగరేణి చరిత్రలో అత్యధిక లాభాలు (రూ. 6,394 కోట్లు) సాధించామని, అత్యధికంగా 34 శాతం లాభాల వాటా కింద రూ.802 కోట్లను కార్మికులకు చెల్లించినట్లు చెప్పారు. పొరుగు సేవల సిబ్బందికి రూ.5,500 చొప్పున లాభాల వాటా చెల్లించామని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *